కొత్త కొత్త క‌థ‌ల‌తో ఎన్నో చిత్రాలు తెర‌కెక్కుతుంటాయి. కొన్ని హార‌ర్‌, మ‌రికొన్ని ఫ్యామిలీ, ఇంకొన్ని ల‌వ్ అండ్ రొమాన్స్ ఇలా ఇవ‌న్నీ ఒకెత్తైతే కొన్ని సెంటి మెంట్ చిత్రాలు ఉంటాయి. వాటిలో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ కి కొంత ప్రాధాన్య‌త ఉంటుంది. మ‌రికొన్ని చిత్రాలు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉంటాయి. అవి కొన్ని సోష‌ల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటాయి. మ‌రి ఈ  బి.జె చిత్రం బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన చిత్రం ఇది సొసైటికీ ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల్లో ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది అన్న‌ది తెర‌మీద చూడాల్సిందే. ఇక‌పోతే బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల చిత్రం అంటే ఎక్కువ‌గా మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. మ‌రి ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అవుతుందా లేదా అన్న‌ది వేచి చూడాలి.


బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల కష్టనష్టాలపై రూపొందిన చిత్రం 'బి.జె'. 'బడుగు జీవులు' అన్నది ఉప శీర్షిక. నిర్మాతలు-దర్శకుడు తదితరులంతా బడుగు బలహీన వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. ఎస్.బి ప్రొడక్షన్స్ పతాకంపై తోట సుధాకర్-విభూది బాలరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు చేసుకొని సెన్సార్ కు సిద్ధంగా ఉంది. రోబోట్  సుధాకర్. యన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ బాబు, సేయిన్ కాన్ లోన్, హీనారాయ్, మంజీరా, సునీతామనోహర్, కాలకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రధారులు. ఆసక్తికరమైన కథ-కథనాలతో  బడుగు జీవుల సాధక బాధలు కళ్ళకు కట్టినట్లు రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాతలు తోట సుధాకర్-విభూది బాలరాజు చెబుతున్నారు. బడుగు జీవుల హక్కుల కోసం పోరాడుతూ రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై తెరకెక్కించామని దర్శకుడు రోబోట్ సుధాకర్.ఎన్ అన్నారు. 


ఈ చిత్రానికి కథ-మాటలు: గురుచరణ్, పాటలు: గురుచరణ్-మాధవ్ స్వామి, సంగీతం: సతీష్ సాలూరి, కెమెరా: నాగబాబు కర్రా, నిర్మాతలు: తోట సుధాకర్-విభూది బాలరాజు, దర్సకత్వం:  రోబోట్ సుధాకర్.ఎన్!!


మరింత సమాచారం తెలుసుకోండి: