హరీష్ శంకర్ సినిమాలలో కామెడీ బాగా ఉంటుంది. ఒకవైపు తన మూవీ కథను చాల పవర్ ఫుల్ గా నడిపిస్తూనే మరొక వైపు సగటు ప్రేక్షకుడు కోరుకునే కామెడీని తన సినిమాలో ఉండే విధంగా హరీష్ శంకర్ తన మూవీ సీన్స్ ను డిజైన్ చేసుకుంటాడు. 

ఇప్పుడు ఇదే పద్ధతి వచ్చే వారం విడుదల కాబోతున్న వాల్మీకిలో కూడ కనిపించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్’ మూవీ ఘన విజయంలో ఆ మూవీలో వచ్చే అంత్యాక్షరి సీన్ ఎంతో కీలకం. ఆ సీన్ లో పవన్ కామెడీతో పాటు ఆ అంత్యాక్షరి సీన్ లో నటించిన అనేకమంది చిన్న నటులకు ఆతరువాత కాలంలో ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. 

ఇప్పుడు అదే సెంటిమెంట్ ‘వాల్మీకి’ లో కనిపించబోతోంది. ఒక ప్యారడీ ఎపిసోడ్ లో హరీష్ శంకర్ కు చెందిన కామెడీ బ్యాచ్ అంతా మళ్ళీ రంగంలోకి దిగుతోంది. ఈసీన్ కు సంబంధించి అప్పుడే ఫోటోలు కూడ విడుదల చేస్తున్నారు. ‘వాల్మీకి’ గెటప్ లో ఉన్న వరుణ్ తేజ్ కమెడియన్స్ తో కలిసి చేసే ప్యారడీ హంగామా ఈ మూవీకి హైలెట్ అవుతుంది అని అంటున్నారు.

వాస్తవానికి ఈమూవీ తమిళ వెర్షన్ లో ఈ కామెడీ ఎపిసోడ్ లేదు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ ఈసీన్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కామెడీ ఎపిసోడ్ లో వరుణ్ తేజ్ చేత పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేయించినట్లు టాక్. పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఈసీన్ క్లిక్ అయితే పవన్ అభిమానుల సపోర్ట్ తో మంచి కలక్షన్స్ రాబట్టుకోవచ్చు అన్న వ్యూహంలో ఈసీన్ క్రియేట్ చేసినట్లు అర్ధం అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: