నేచురల్ స్టార్ నాని సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండస్ట్రీ వర్గాల్లోనూ.. ట్రేడ్ సర్కిల్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ? ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాని సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువ‌త క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తారు. అయితే తాజా చిత్రం గ్యాంగ్‌లీడర్ సినిమా విష‌యంలో మాత్రం ఇందుకు పూర్తి రివ‌ర్స్‌ వాతావరణం కనిపిస్తోంది. గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. సినిమా థియేటర్ లోకి వచ్చేందుకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా టైటిల్ తో రావటం ప్లస్.


గ్యాంగ్‌లీడ‌ర్ విష‌యంలో ఎందుకో గాని ఈ సినిమా నిర్మాతల నుంచి సరైన ప్రమోషన్ కనపడటం లేదు. నాని తన వంతుగా బిగ్‌బాస్‌కి రావడం, వివిధ కాలేజీల టూర్‌కి వెళ్లడం లాంటివి చేస్తున్నాడు కానీ ఈ సినిమాకి తగినంత సౌండ్‌ లేదనేది మాత్రం నిజం. నాని గత చిత్రం జెర్సీకి ఓ రేంజ్‌లో ప‌బ్లిసిటీ చేశారు. ప‌బ్లిసిటీ వ‌ల్లే ఆ సినిమాకు మంచి వ‌సూల్లు వ‌చ్చాయి. అంతెందుకు మైత్రీ వాళ్ల చివ‌రి చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌కు ప‌బ్లిసిటీ ఎలా చేశారో ?  చూశాం.


ఇప్పుడు గ్యాంగ్‌లీడ‌ర్ మాత్రం జీరో జజ్‌తో వ‌స్తోంది. ఇదే బ‌జ్‌తో రిలీజ్ చేస్తే బెస్ట్‌ ఓపెనింగ్‌పై ఆశలు వదిలేసుకోవచ్చు. ఒకవేళ టాక్‌ బాగా వచ్చినా కానీ ఓపెనింగ్‌ పరంగా ఏర్పడిన లోటు పూడ్చుకోవడం కష్టం కావచ్చు. ఈ సినిమా వ‌చ్చిన మ‌రుస‌టి వార‌మే వ‌రుణ్ తేజ్ వాల్మీకి వ‌స్తోంది. వారంలో క‌లెక్ష‌న్లు కుమ్ముకోక‌పోతే గ్యాంగ్‌లీడ‌ర్‌కు ఆ మ‌రుస‌టి వారం క‌ష్టం అవుతోంది. ఇంత పోటీ ఉన్నా గ్యాంగ్‌లీడ‌ర్ ప్ర‌మోష‌న్ల విష‌యంలో యూనిట్ ఎందుకు ? స‌్త‌బ్దుగా ఉందో ? అర్థం కావ‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: