యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా  దర్శక ధీరుడు  రాజమౌళి దర్శకత్వంలో   రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. కాగా ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటుంది.  అయితే ఈ చిత్రంలో  ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి.  అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక  రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి  ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట.  ఆ పాత్రలోనే  ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.  గతంలో ఇదే పాత్రలో నిత్యా మీనన్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ జక్కన్న చివరికీ హిందీ భామ వైపే మొగ్గు చూపాడు. అయితే ఆ హిందీ హీరోయిన్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో డైలాగ్ లు  చాలా బాగుంటాయని..  సినిమాలో    ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా  హైలెట్ అవ్వనున్నాయని తెలుస్తోంది.  ముఖ్యంగా  తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట.  రాజమౌళి  తన సినిమాల్లో విజువల్స్ ని తప్ప..   డైలాగ్ లను పెద్దగా  నమ్ముకొరు. కానీ ఈ చిత్రంలో రాజమౌళి  డైలాగ్ లకి  కూడా  ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.   ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ  చిత్రానికి మాటలు రాస్తున్నారు. 


ఇక  యూరోపియన్ దేశంలోని  బల్గేరియాలో  రాజమౌళి ఇప్పటికే బాహుబలి 2 యాక్షన్ సీక్వెన్స్ స్ ను షూట్ చేశాడు. కాగా తాజాగా  ఇప్పుడు, రాజమౌలి క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్  లోని కొన్ని సీన్స్ ను  కూడా  బల్గేరియాలో షూట్ చేస్తున్నారు.  రాజమౌలి తన చిత్రబృందంతో  3 వారాల పాటు సాగే  సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్  ప్లాన్ చేశారు.  ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై  కీలకమైన  యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు.  ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.  ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు.  కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.  డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.  జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  కాగా  'బాహుబలి' తరవాత   రాజమౌళి  చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: