బిగ్ బాస్ లో బుధవారం స్టార్ట్ అయిన టాస్క్ గురువారం కూడా కంటిన్యూ అయింది.  ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్ లో చాలా పొరపాట్లు జరిగినట్లు తెలుస్తుంది. కొన్ని పొరపాట్లు కంటెస్టెంట్స్ చేస్తే, కొన్ని పొరపాట్లు బిగ్ బాస్ చేశాడు. ముఖ్యంగా రవి, మహేష్ విషయాల్లో ఈ రెండింటినీ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రవిని దయ్యంగా మార్చాలంటే ఆల్రెడీ దయ్యాలుగా ఉన్న వాళ్ళు పాట పాడి అతని చేత డాన్స్ చేయించాలి.


కానీ గురువారం ఉదయం నిద్రలేచే సమయానికి వచ్చే పాటకి రవి డ్యాన్స్ చేశాడని అతన్ని దెయ్యంగా మార్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కంటెస్టెంట్స్ ఏమీ చేయకుండానే రవి దెయ్యంగా మారిపోయాడు. అలాంటప్పుడు వాళ్ళకి టాస్క్ ఇవ్వడం దేనికి. టాస్క్ సరిగా పర్ ఫార్మ్ చేయట్లేదని మందలించే బిగ్ బాస్, టాస్క్ ని సరిగ్గా నిర్వహించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే కంటెస్టెంట్స్ కి టాస్క్ ఆడాలన్న ఆసక్తి తగ్గిపోతుందని బిగ్ బాస్ గుర్తించాలి.


ఇక మహేష్ విషయానికొస్తే,టాస్క్ లో అతని చేత బట్టలు మార్పించాలి అన్నది టాస్క్. కానీ కంటెస్టెంట్స్ అతని బట్టలు బలవంతంగా మార్చడం వింతగా అనిపించింది. మార్చాలి అనడానికి మార్పించాలి అనేదానికి చిన్న తేడా ఉంది. ఈ తేడాని కంటెస్టెంట్స్ గుర్తించలేదు. కనీసం బిగ్ బాస్ అయినా ఈ విషయాన్ని గుర్తు చేయలేదు. టాస్క్ సరిగా ఆడట్లేదని కంటెస్టెంట్స్ ని హెచ్చరించిన బిగ్ బాస్ ఇప్పుడు టా ఆడుతున్నప్పుడు బిగ్ బాస్ తప్పులు చేయడం ఏమీ బాగాలేదని వాదిస్తున్నారు.



ఇది ఇలాగే కొనసాగితే ప్రేక్షకులకి టాస్క్ ల మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితి రాకుండా బిగ్ బాస్ జాగ్ర్రత్త పడితే బాగుంటుంది. అంతే కాకుండా టాస్క్ లో కంటెస్టెంట్స్ తప్పు చేసినా ఫర్వాలేదని అనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ తప్పులు చేయడం బాగాలేదని అంటున్నారు. మరోవైపు అలా చేయడం వెనక ఏదైనా మర్మం దాగుందేమోననే వాదన కూడా వినిపిస్తుంది. కంటెస్టెంట్స్ కి కోపం తెప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఆ విధంగా చేసి ఉంటారేమోనని అనుకుంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: