బుధవారం జరిగిన టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ సగం వరకూ బాగానే పర్ ఫార్మ్ చేశారు. మిగతా సగం టాస్క్ ని  వాళ్ళు సరిగ్గా పూర్తి చేయలేకపోయారు. ముఖ్యంగా పునర్నవి అతిగా ప్రవర్తించింది. ఆమె బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నే తప్పు బట్టింది. బిగ్ బాస్ ఏది చెప్తే అది చేయాలా? ఇక్కడికి వచ్చింది అందుకేనా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయితే పునర్నవి మాటలని గమనిస్తే ఆమె మాటల్లో కొంతవరకు నిజం ఉన్నప్పటీకీ మిగతాదంతా వ్యర్థ వాదనలాగా అనిపిస్తుంది.


టాస్క్ లో పునర్నవి మనిషిగా ఉన్నప్పుడు ఆమెని అందరూ కలిసి ఫూల్ లోకి తోసేయడం తప్పే. పూల్ లోకి ఒకరే తోసేయాలి అనేది టాస్క్ కానీ కంటెస్టెంట్స్ ఆ విషయాన్ని మర్చిపోయారు. బిగ్ బాస్ ఈ విషయాన్ని గుర్తు చేయకపోవడంతో పునర్నవికి బాగా కోపం వచ్చింది. అయితే పునర్నవి దెయ్యం అయిన తర్వాత మిగతా మనుషులుగా ఉన్న వారిని దెయ్యంగా మార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు.
ఎంతసేపు బిగ్ బాస్ అలా చేశాడు, ఇలా చేశాడు అని వాదించిందే కానీ దెయ్యం అయిన తర్వాత కూడా టాస్క్ చేయాలనే చిన్న విషయాన్ని ఆమె పట్టించుకోలేదు.


దీంతో బిగ్ బాస్ ఆమెని వరస్ట్ పర్ ఫార్మర్ గా ప్రకటించాడు. అపుడు పునర్నవి మరింత కోప్పడింది. బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ని స్వీకరించనని తెగేసి చెప్పింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, బిగ్ బాస్ లోకి వచ్చే ముందే ఏమేం చేయాలి ఏమేం చేయకూడదనే విషయాలన్నీ వాళ్లకి తెలుసు. అయినా కూడా మొండిగా ప్రవర్తించడం అనేది ప్రేక్షకుల దృష్టిలో తన పట్ల సానుభూతి క్రియేట్ చేయడానికే అనే వాదన బలంగా వినిపిస్తుంది.


అయితే ఇలా ధిక్కారాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల్లో ఆమెపై వ్యతిరేకత పెరుగుతుందా? లేదా సానుకూలత పెరుగుతుందా అనేది చూడాలి. కానీ మెజారిటీ ప్రేక్షకుల్లో ఆమెపై వ్యతిరేకత పెరుగుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్స్ లో పునర్నవికి ఆమె ప్రవర్తన మరింత డేంజర్ లో పడేసే ప్రమాదం లేకపోలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: