మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే  అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన  సైరా సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. చరిత్ర నేపథ్యంలో స్వాతంత్ర పోరాట కథగా సైరా సినిమాని తెరకెక్కించారు. దాదాపు చాలా కాలం తర్వాత మెగాస్టార్ సినిమా విడుదల కాబోతున్న నేపద్యంలో మెగా అభిమానులు సైరా సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు ట్రైలర్ విడుదల చేశాక సినిమాపై అంచనాలు మరింత తారాస్థాయికి పెంచేసుకున్నారు అభిమానులు. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సైరా ఏ స్థాయిలో విడుదల అవుతుందో అదే స్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల చేయాలని భావిస్తున్నారు సైరా సినిమా నిర్మాత రామ్ చరణ్ తేజ్.


ఇందుమూలంగా అనే సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద నటీనటులను ముందుగానే ప్లాన్ చేసి రామ్ చరణ్ పెట్టుకున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల బాహుబలి సినిమా తర్వాత నుండి వరుసగా తెలుగు సినిమా స్టోరీ లు బాలీవుడ్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్న క్రమంలో తెలుగు ఇండస్ట్రీకి బాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పడిన క్రమంలో దీన్ని క్యాష్ చేసుకోవడానికి రామ్ చరణ్ సినిమా ప్రారంభం నుండే బాలీవుడ్ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలా సైరా సినిమా అన్ని రెడీ చేసినట్లు సమాచారం.


ఇటువంటి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాని బాలీవుడ్ లో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో విడుదల చేయబోతున్నారు. అయితే మినిమమ్ హిందీలో 2000 స్క్రీన్స్ లలో సైరా చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ రామ్ చరణ్, ఫర్హాన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఏరియాల్లో మెగాస్టార్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కానుందని చెప్పవచ్చు. మరి సైరా సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: