మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా  కామెడీ, రొమాంటిక్ చిత్రాల దర్శకుడు మారుతీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా  "ప్రతి రోజు పండగే".  కాగా నిన్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.  మోషన్ పోస్టర్  ఈ చిత్రానికి మంచి  పాజిటివ్ వైబ్ ను తీసుకువచ్చింది.  పోస్టర్ లో తేజ్ మరియు సత్యరాజ్ రిలేషన్ బాగా హైలెట్ అయ్యేలా ఉండటం ముఖ్యంగా సత్యరాజ్ చిన్నపిల్లడిలా ఉత్సాహంగా కనిపించడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం  ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.  వర్షంలో చిన్నపిల్లాడిలా గెంతుంతున్న సత్యరాజ్ ని తేజ్ వారిస్తున్నట్లున్న ఆ పోస్టర్ వైవిధ్యంగా ఉంది. సత్యరాజ్ ని ఈ చిత్రంలో గతానికి భిన్నంగా దర్శకుడు మారుతి ప్రెసెంట్ చేస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.  ప్రస్తుతం  హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది ఈ చిత్రం.  ఇక  క్రిష్టమస్ సందర్భంగా  డిసెంబర్ 20న  ఈ చిత్రాన్ని   విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఇక త్వరలో రాజమండ్రిలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.  అయితే  బాహుబలి కట్టప్పగా పేరుగాంచిన నటుడు సత్యరాజ్ "ప్రతిరోజూ పండగే" చిత్రంలో ధరమ్ తేజ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. 


ఈ సినిమాలో సత్యరాజ్ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తోందట.  కమల్ హాసన్ హీరోగా 1978లో విడుదలైన  "సత్తం ఎన్ కైయిల్" చిత్రంతో  సత్యరాజ్ సినీరంగ ప్రవేశం చేసి..  విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  అనేక వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు.  కాగా  "ప్రతి రోజు పండగే" చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ "సుప్రీం" సినిమాలో కలిసి నటించడం జరిగింది.  ఇక మిగిలిన కీలక పాత్రల్లో  విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు  


మరింత సమాచారం తెలుసుకోండి: