స్టార్ డైరెక్టర్  పూరి జగన్నాథ్  మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం  పూరి తన తదుపరి సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  కాగా ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. పూరి - విజయ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ప్రేమ కోసం ఓ యువకుడు  ఏం చేశాడనేదే సినిమా పాయింట్ అట.  ఇక ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే  టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  సినీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్  యంగ్  హీరో విజయ్ దేవరకొండ సరసన  నటించబోతుట. అందుకేనేమో ఆ మధ్య   'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి  ప్రియా పోస్ట్  కూడా చేసింది.


 దాంతో  విజయ్ దేవరకొండ, పూరిని  అడిగి మరి  అమ్మడికి అవకాశం ఇప్పించాడట.  త్వరలోనే ఈ వార్తకు  సంబంధించి చిత్రబృందం అధికారకంగా ప్రకటించనుంది.  ఇక  ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది. ఎలాగూ దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి  మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే. మరి పూరి సినిమాతోనైనా ప్రియా ప్రకాష్ కి భారీ హిట్ వస్తోందేమో చూడాలి.  అలాగే ఈ సినిమాలో నటించే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  ఇక ఈ సినిమా కూడా  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా  నిర్మించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన  పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపథ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: