సెలెబ్రెటీలు అంటే సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న  వారు అని అందరు అంటుంటారు. అలా అయితే మరో సినిమా అవకాశం వస్తాయి , ఒక నాలురాళ్లు వేనకేసుకోవచ్చు అని అనుకుంటారు. సినిమా అవకాశాలు వస్తే ఎవరైనా కింగ్ అవుతారు లేకపోతే ఎవరైనా కూడా రోడ్డున పడాల్సిందే. ఇకపోతే చాలా మంది సినీ తారలు ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. 


ప్రస్తుతం చాలా మంది నటిస్తున్నారు. కొందరైతే నటించేసారు కూడా.. అలా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి కూడా రెమ్యునరేషన్ ఎక్కువే అని తెలిసిన విషయం. రాను రాను సినిమాలకు మించిన విదంగా ఈ వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. మొదటగా ఈ వెబ్ సిరీస్ లు హిందీలో మాత్రమే ఎక్కువగా ఉండేవి రాను రాను తెలుగులో కూడా ఈ సందడి మొదలైంది. 


మెగా డాటర్ నిహారికా తొలుత వెబ్ సిరీస్ లలో నటించి సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు ఈమెకు కలిసి రాకపోవడంతో మళ్ళి ఎక్కడి నుండి వచ్చిందో ఇక్కడికే వెళ్ళింది. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ లను తెరకెక్కించడంలో ముందుంది. మొదటి సిరీస్ లో ప్రియమణి, సందీప్ కిషన్ నటించారు. ఇప్పుడు రెండో సీజన్ మొదలైంది. అందులో సమంత నటిస్తుంది. జగపతి బాబు, నవదీప్, శ్వేతా బసు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. 


హిందీ విషయంలోకి వస్తే హాట్ స్టార్ రాధికా ఆప్టే కూడా ఈ వెబ్ సిరీస్ లలో రెచ్చిపోతుంది. గతంలో చాలా మంది అగ్రతారలు అయినా సైఫ్ ఆలీ ఖాన్ కూడా ఈ సిరీస్లో నటించి మంచి పేరును సంపాదించారు. సినిమాలలో సెన్సార్ అని ఇలా చాలా రూల్స్ ఉంటాయి. కానీ, వెబ్ సేరీలకు ఎటువంటి రూల్స్ లేవు అందుకే అధిక డబ్బును, పేరును దానితో పాటుగా పాపులారిటీ కూడా వస్తుంది. అయితే, సినిమాల కన్నా కూడా ఈ వెబ్ సిరీస్ ల హావా నడుస్తుందని తెలుస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: