బాలకృష్ణ,దేవిశ్రీ నేపధ్య సంగీతం,కొని యాక్షన్ సన్నివేశాలు,డైలాగ్స్బాలకృష్ణ,దేవిశ్రీ నేపధ్య సంగీతం,కొని యాక్షన్ సన్నివేశాలు,డైలాగ్స్కథలో దమ్ము లేకపోవడం,నాసిరకం కామెడీ,సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం,రాజకీయాల గురించి ఎక్కువగా చర్చించడం

కృష్ణ(బాల కృష్ణ) ఒక చలాకి యువకుడు దుబాయ్ లో నివసిస్తూ ఉంటాడు , సోనాల్ చౌహన్ ని ప్రేమించిన కృష్ణ, మాణిక్యం(బ్రహ్మానందం) సహాయంతో వైజాగ్ లో పెళ్లికి వస్తాడు. "నేను కొన్ని చూడకూడదు వినకూడదు అనుకుంటాను అలాంటివి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది" అనే వ్యక్తిత్వం కృష్ణ ది అలాంటి ఒక సంఘటన వలన కృష్ణకు జితేంద్ర (జగపతి బాబు) తో శత్రుత్వం ఏర్పడుతుంది. దాంతో జీతెంద్ర ఎలా అయిన కృష్ణ మీద ప్రతీకారం తీర్చుకోవాలని సోనాల్ చౌహన్ ను కిడ్నాప్ చేస్తాడు. అంతే కాకుండా కృష్ణ కుటుంబం మొత్తాన్ని చంపేయమని ఆదేశాలు ఇస్తాడు. కాని ఆ సంఘటన నుండి కృష్ణ కుటుంబాన్ని సింహాచలం కాపాడుతాడు. ఇంతకీ ఈ సింహాచలం ఎవరు? అతనికి కృష్ణ కి ఉన్న సంభంధం ఏంటి? అనేది తెర మీద చూడాల్సిందే...

బాలకృష్ణ ఎప్పటిలానే తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. రెండు పాత్రలు చేసిన బాలకృష్ణ రెండు పాత్రలకు మధ్య తేడాను స్పష్టంగా చూపగలిగారు. ఇక విలన్ గా జగపతి బాబు కూడా అద్భుతం అయిన నటనా ప్రదర్శన కనబరిచారనే చెప్పుకోవాలి. అయన పాత్ర ఎలివేషన్ అంతగా లేకపోయినా అయన నటించిన తీరు మరియు డైలాగ్ డెలివరీ మాత్రం ఆశ్చర్యకరం.. రాధిక ఆప్టే మంచి పాత్రనే పోషించినా కూడా ఆమె నటనా తీరు మాత్రం పరవాలేదనిపించింది. సోనాల్ చౌహన్ తన అందంతో ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది. సుహాసిని, కళ్యాణి , సూర్య కిరణ్, బ్రహ్మాజీ, చలపతి రావు మరియు ఆహుతి ప్రసాద్ వంటి నటులు చాలా మంది తమ పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచారు.

కొత్తదనం లేని కథనంతో ఆకట్టుకోవాలన్న బోయపాటి ప్రయత్నం విఫలం అయ్యిందనే చెప్పాలి. కథనం పరంగా ఈ చిత్రానికి జీరో రేటింగ్ ఇవ్వాలి బొత్తిగా ఆకట్టుకోలేకపోయారు కథనం విషయంలో. ఇక చిత్ర నిడివి కూడా ఎక్కువగా ఉండటంతో చిత్రం పూర్తయ్యేసరికి నిద్ర వచ్చేస్తుంది. కాని కొన్ని సన్నివేశాల వరకు అద్భుతం చూసిన ఫీలింగ్ వస్తుంది అదే సమయంలో కామెడీ విషయంలో అదః పాతాళంలో తొక్కుతున్న ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ అందించిన రామ్ ప్రసాద్ పనితనం చాలా బాగుంది. ఈ చిత్రానికి డైలాగ్స్ హైలెట్ ముఖ్యంగా రాజకీయాలను గురించిన సంభాషణలు ప్రస్తుత పరిస్థితులకు బాగా దగ్గరగా ఉండడంతో ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఎడిటర్ కోటగిరి గారు ఇంకాస్త శ్రద్ద వహించి ఉండవలసింది. చిత్రంలో కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటె చిత్ర వేగం బాగుండేది. దేవిశ్రీ అందించిన సంగీతం పరవలేధనిపించినా అయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలకు చాలా బాగున్నాయి చిత్రం ఆసాంతం రిచ్ గా ఉంటుంది...

సింహ తరువాత అదే "కాంబినేషన్" లో వచ్చిన చిత్రం కావడంతో "లెజెండ్" చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగట్టుగానే ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో చిత్రం మీద అంచనాలు మరింత పెరిగాయి. కాని దర్శకుడు బోయపాటి ఆ అంచనాలను చేరుకోవడంలో విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించిన బోయపాటి వాటిని దగ్గరకు చేర్చే విషయంలో ఘోరంగా విఫలం అయ్యారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళినా కూడా రెండవ అర్ధ భాగం ఆ స్థాయిలో తెరకేక్కించలేక పోయారు. బాలకృష్ణ నటనకు దేవిశ్రీ సంగీతం ఈ రెండింటికి బోయపాటి డైలాగ్స్ అద్భుతంగా కుదిరినా సన్నివేశంలో బలం లేక ఇవన్ని వృధా అయిపోయాయి. రెండవ అర్ధ భాగం బాగా నేమ్మదించడం తో సగటు ప్రేక్షకుడు చాలా ఇబ్బందిపడతాడు కాని అప్పుడప్పుడు ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉన్న డైలాగ్స్, ఇంకా బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ జగపతి బాబు డైలాగ్స్ ఇవన్ని కలిసి చిత్రాన్ని ఆదుకోవాలనే ప్రయత్నం చేసినా పటుత్వం లేని కథనం మరియు చేవ లేని దర్శకత్వంతో ఇవన్ని వృధా అయిపొయాయి. బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఈ చిత్రం కన్నుల పండుగ కాని సగటు ప్రేక్షకుడిని అధిక హింస మరియు నాసిరకం కామెడీ ఇబ్బంది పెట్టినా కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటుంది. మీరు మాస్ చిత్రాలను ఇష్టపడితే , బాలకృష్ణ అద్భుతమయిన నటన చూడాలని అనుకుంటే దగర్లోని థియేటర్ కి వెళ్ళిపొండి..

Nandamuri Balakrishna,Radhika Apte,Boyapati Srinu,Ram Achanta,Sonal Chauhanలెజెండ్ - దమ్ము కన్నా ఎక్కువ సింహ కన్నా తక్కువ

మరింత సమాచారం తెలుసుకోండి: