టాలీవుడ్ లో మాస్ మహరాజ ‘బెంగాల్ టైగర్’ సినిమా ఫ్లాప్ తర్వాత రెండు సంవత్సరాలు సినీ పరిశ్రమకు గ్యాప్ ఇచ్చాడు.  గత ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఈ మూవీ సూపర్ డూప్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన నేల టిక్కెట్టు,టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంథోని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో రవితేజ ఒక్కసారే టెన్షన్లో పడిపోయాడు..దాంతో తన తదుపరి సినిమా మంచి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.


ఈ నేపథ్యంలో మాస్ మహారాజ్ రవి తేజ తన పవర్ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.    డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న డిస్కో రాజా మ్యూజిక్ ఆల్బమ్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేస్తున్నారు.


ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ తో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు.  మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: