కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ,వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. ‘సైరా’ బృందాన్ని సన్మానించి అభినందించారు.  


ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గారిని గెడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో చూసే అవకాశం కల్పించారు. ఇలా అందరినీ ఈ వేదికపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమాలకు సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేస్తారు. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే సుబ్బిరామిరెడ్డిగారే కారణం. నా బిజీ షెడ్యూల్‌లో కూడా ఇక్కడకు వచ్చేలా సపోర్ట్ చేసిన సుబ్బిరామిరెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సినిమా సక్సెస్ అయ్యాక దాన్ని ఎంజాయ్ చేయడానికి కద‌రదు. ఈ రోజు ఒక్క క్షణమైనా ఆ ఎంజాయ్‌మెంట్ పొందుతున్నానంటే అది మీ వల్లే. సో థ్యాంక్యూ సోమచ్ టు సుబ్బిరామిరెడ్డి గారు. ఈ సినిమాలో నటించే గొప్ప అదృష్టాన్ని కల్పించిన సురేందర్‌రెడ్డి, రామ్ చరణ్, చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్.’’ అన్నారు.


పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..‘‘సైరా నరసింహారెడ్డి అనగానే సైరా అంది ఫస్ట్ చిరంజీవి గారు. నెక్ట్స్ సైరా అంది మా చరణ్ బాబు. సైరా నరసింహారెడ్డి అనే సినిమాను జనంలోకి తీసుకెళ్లగానే జనమంతా ‘సైరా’ అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన చరణ్ బాబుకు, మా ఎవర్‌గ్రీన్ హీరో చిరంజీవి, మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డికి అభినందనలు. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ తాను ఉండి ప్రోత్సహించే సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు.’’ అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: