టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు నాగ చైతన్య-సమంత.  ‘ఏం మాయ చేసావే’ సినిమాతో ఈ జంట రియల్ లైఫ్ లో ప్రేమలో పడ్డారు.  మనం సినిమా తర్వాత పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.  అయితే వివాహం తర్వాత సమంత సినిమాల్లో నటించదని తెగ వార్తలు వచ్చాయి. కానీ దానికి పూర్తిగా రివర్స్ అయ్యింది.  వివాహం తర్వాత సమంత నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతూ వచ్చాయి. నాగ చైతన్య- సమంత జంటగా నటించిన ‘మజిలీ ’ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక యూటర్న్,ఓ బేబీ లాంటి లేడీఓరియెంటెడ్ సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి.  ప్రస్తుతం టాప్ హీరో, హీరోయిన్లు ఎక్కువగా ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా అక్కినేని సమంత కూడా ఇలాంటి ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. నటిగా ప్రయోగాత్మక సినిమాలు చేసే మూడ్ లో ఉన్న సమంత ఆ కారణంగానే వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఓకే చెబుతోంది. ఈ మద్య అమెజాన్ ప్రైమ్ లో 'ది ఫ్యామిలీ మేన్' అనే సిరీస్ సీజన్ 1 విడుదలైంది.  మనోజ్ బాజ్పాయ్ నటించిన ఈ సిరీస్ కి ప్రేక్షకాదరణ లభించింది.

ఇందులో మనోజ్ కి భార్యగా ప్రియమణి నటించింది. అలానే కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా ఓ రోల్ లో కనిపించాడు.  త్వరలో రెండో సీజన్ కూడా రాబోతుంది. ఈ సీరీస్ లో సమంత కూడా కనిపించబోతుందట..కాకపోతే నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది.  మరి నెగిటీవ్ పాత్రలో సమంతను అభిమానులు రిసీవ్ చేసుకోగలుగుతారా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: