ఎన్నికలలో ‘జనసేన’ ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యక్రమాల కంటే తెలంగాణ ప్రాంతంలోని యురేనియం మైనింగ్ అక్రమ దందా నీటి పొడుపు ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాల పై బ్యాన్ వంటి సామాజిక కార్యక్రమాల పై ఎక్కువగా ఫోకస్ పెడుతూ వచ్చాడు. ఎన్నికల ఓటమి తరువాత పవన్ తన ‘జనసేన’ కార్యకర్తలతో కొన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పటికీ ‘జనసేన’ కార్యకర్తలలో పూర్తి స్థాయిలో ధైర్యం నింపలేకపోయాడు అన్న విమర్శలు వచ్చాయి.

దీనికితోడు గత కొన్నిరోజులుగా ‘జనసేన’ నుండి అనేకమంది నాయకులు వేరే రాజకీయ పార్తీలలోకి వెళ్ళిపోతున్నా ఆవిషయాలు తనకు పట్టనట్లు పవన్ వ్యవహరిస్తున్నాడు. ఈమధ్యలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప ఎక్కడ బహిరంగ కార్యక్రమాలలో కనిపించలేదు. పవన్ అనారోగ్యం గురించిన వార్తలు ఎన్నో వచ్చినా ఆ వార్తల పై ఎటువంటి ఖండన ఇవ్వలేదు. 

ఇలాంటి పరిస్థితులలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నిన్న హరిద్వార్ వెళ్ళి గంగానది ప్రక్షాళన కోసం పోరాడిన ప్రొఫిసర్ జీడి అగర్వాల్ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హరిద్వార్ వెళ్ళిన పవన్ హరిద్వార్ లో మాత్రి సదన్ ఆశ్రమం వ్యవస్థాపకులు స్వామి శివానంద మహారాజ్ ను కలిసి చాల సేపు మాట్లాడినట్లు తెలుస్తోంది. వారి మాటల మధ్య స్వామీజీ గంగా ప్రక్షాళన కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగస్వామి కావలసిందిగా పవన్ కోరినట్లు తెలుస్తోంది. 

అంతేకాదు రోజురోజుకు కలుషితమైపోతూ విలువలు నశించిపోతున్న రాజకీయాలో కంటే ఒక సామాజిక ఉద్యమానికి దేశవ్యాప్తంగా నాయకత్వం వహించగల లక్షణాలు పవన్ కళ్యాణ్ కు ఉన్నాయని స్వామి శివానంద అభిప్రాయ పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి స్పందనగా పవన్ గంగానది ప్రక్షాళన మన భారతీయ సంస్కృతి రక్షణకు ఎంతో అవసరం అన్న విషయాన్ని అంగీకరిస్తూ ఈ విషయమై తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ రానున్న రోజులలో రాజకీయ నాయకుడుగా కాకుండా సామాజిక ఉద్యమ నేతగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: