మెగా కాంపౌండ్ నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మెగాబ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి మెగా హీరోల అందరి కంటే చాలా స్పీడ్ మీద ఉన్నాడు. తాజాగా ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గద్దలకొండ గణేష్' అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ వెంటనే తాజాగా మరొక సినిమా మొదలు పెట్టేసాడు. కెరీర్ పరంగా ఇప్పటికే 9 సినిమాలు చేసిన వరుణ్ తేజ్ తాజాగా పదో సినిమా స్పెషల్ గా ఉండాలని భావించి బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో కలిగిన స్టోరీని సెలెక్ట్ చేసుకుని కిరణ్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు వరుణ్ తేజ్.


అయితే 'గద్దలకొండ గణేష్' వంటి సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే వరుణ్ తేజ్ సినిమా మొదలు పెట్టడంతో అంతేకాకుండా ఇండస్ట్రీకి వచ్చి అది కూడా మెగా కాంపౌండ్ నుండి రావడంతో ఇంత స్పీడ్ గా...వరుణ్ తేజ్ సినిమాలు చేయడంతో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు అని అంటున్నారు. తాజాగా మొదలు పెట్టిన కొత్త సినిమా ప్రారంభించిన రోజు  'వరుణ్ తేజ్ 10' అనే హ్యాష్ ట్యాగ్ చూసి చాలా మంది పై విధంగా స్పందించారు.


ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో ఇంత స్పీడ్ గా...సినిమాలు చేస్తున్న హీరో వరుణ్ తేజ్ అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఒక వైపు ఎప్పటి నుండో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు ఇంకా 20 - 25 దగ్గరే ఉంటే అప్పుడే మెగా హీరో పది సినిమాలు చేసేసాడా..? అంటూ చర్చించుకుంటున్నారు. మరోపక్క వరుణ్ తేజ్ కూడా కెరీర్ పరంగా కొత్త కొత్త పాత్రలు చేస్తూ మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాడు. తాజాగా మొదలుపెట్టిన పదో సినిమా ఎటువంటి హిట్ అందుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: