సీజన్ 3 బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. 12 వారాలు ముగించుకుని ఆదివారం ఎపిసోడ్ తో 13వ వారంలో కి ఎంటర్ కానుంది. తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో ఎప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని కనిపెట్టే బిగ్ బాస్...శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో మాత్రం నిద్ర పోవడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. హౌస్ లో బిగ్ బాస్ నిద్రపోతున్నాడు అంటూ డిస్టర్బ్ చేసిన వాళ్లు పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది టాస్క్ పూర్తయ్యే వరకు ఎవరు నోరు మేధప్పకూడదు మరియు అరవ కూడదు మాట్లాడకూడదు నవ్వ కూడదు అని టాస్క్ ఇవ్వటం జరిగింది.


అంతేకాకుండా వాటితో పాటు ఇంకా కొన్ని టాస్క్ లు..ఇంటిలోని సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు. ఏమిటంటే..శ్రీముఖి అరవకుండా అలీ గుర్రం ఎక్కించుకుని 20 రౌండ్లు కొట్టాలి. పాపం అలీ తనకు కష్టంగా ఉన్నా టాస్క్ పూర్తి చేశాడు. బాబా భాస్కర్ తన శరీరంపై ఉన్న జుట్టుని వాక్స్ చేయాలి. మహేష్ విట్టా తలపై ప్లేట్ పెట్టుకుని కింద పడకుండా.. గోడ కుర్చీ వేయాలి. వితికా, రాహుల్ బెలూన్స్‌కి షేవింగ్ క్రీమ్ రాసి నీట్‌గా షేవ్ చేయాలి. శివజ్యోతికి అలీ కితకితలు పెట్టాలి.. ఈ టాస్క్ పూర్తయిన తరువాత హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చాడు.


బిగ్ బాస్ ఎలా ఉంటాడో ఊహించి బొమ్మ గీయాలి. బిగ్ బాస్ బొమ్మ గీయడానికి హౌస్ మేట్స్ ఇబ్బందులు పడ్డారు. ఫైనల్ గా తమకు నచ్చినట్లు గీసి దానికి అర్ధం కూడా చెప్పారు. మరి అదే విధంగా గురువారం ఎపిసోడ్ మాదిరిగానే శుక్రవారం జరిగిన ఎపిసోడ్ గా కూడా కేకులు ఇంటిలో సభ్యులకు బిగ్ బాస్ తినిపించారు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ బర్తడే సెలబ్రేషన్స్ లో భాగంగా రాహుల్ పాడిన పాటకు బాబా భాస్కర్ చేసిన వీడియో...ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: