బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా తెర‌కెక్కిస్తాడా ? అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆ సినిమా వ‌చ్చిన యేడాదిన్న‌ర‌కు రాజ‌మౌళి ఎట్ట‌కేల‌కు సినిమా ప్ర‌క‌టించాడు. రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోస్ గా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఎన్టీఆర్ పై చిత్రీకరణ చేసిన రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చి చరణ్ పై చిత్రీకరణ చేస్తున్నాడు.


నిన్న మొన్న‌టి వ‌ర‌కు సైరా ప్ర‌మోష‌న్ల‌లో బిజీ బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇప్పుడు చ‌ర‌ణ్‌పై స‌న్నివేశాలు రాజ‌మౌళి షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీం ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ కి సెలెక్ట్ చేసే పనిలో ఉంది. గతంలో ఎన్టీఆర్ పక్కన నటించేందుకు హాలీవుడ్ నుంచి ఎడ్గర్ డేసి తీసుకున్నారు. ఆమె త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి మ‌రో హీరోయిన్ కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.


ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమ‌రం భీం పాత్రలో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా ఇద్దరు హీరోయిన్స్ కావడంతో వారిలో ఒకరిని బాలీవుడ్ హీరోయిన్ ఒకరిని ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే ఆమె ఎవరో ప్రకటిస్తారట. ఇక బ్రిటిష్ లేడీ పాత్ర కోసం మరో హాలీవుడ్ నటిని తీసుకోవాల్సివుంది. రాజ‌మౌళి ఆ బ్రిటీష్ న‌టి కోసం కొన్ని రోజులుగా ఎంత అన్వేషిస్తున్నా స‌రైన అమ్మాయి దొర‌క్క‌పోవ‌డంతో చాలా ఇబ్బంది ప‌డుతున్నారు.


ఇక రామ్ చరణ్ సరసన అలియా భట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2020 జులై లో ఈమూవీ రిలీజ్ కానుంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: