జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో 'ప్రేమెంత పనిచేసే నారాయణ' సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు జొన్నలగడ్డ శ్రీనివాస్ తనయుడు జొన్నలగడ్డ హరికృష్ణ. ఇప్పుడు ఈ యువ నటుడు హీరోగా రెండవ చిత్రం తెరకెక్కుతోంది. జేఎస్సార్‌ మూవీస్ పతాకం పై బి.లింగుస్వామి సమర్పణ లో జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న'ఆటో రజని' సినిమాతో మరో సారి నటుడిగా తన సత్తా చాటడానికి సిద్దమవుతున్నాడు జొన్నలగడ్డ హరికృష్ణ.

పవర్‌పుల్‌ మాస్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు అందించారు. ఈ శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చిత్ర యూనిట్‌ సీఎం జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి దర్శకత్వంలో తనయుడు నటిస్తుండటం విశేషం అంటు జగన్ మాట్లాడారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సీఎం జగన్‌ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన తమ హీరోకి బ్లెస్సింగ్స్‌ అందించడం ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్‌ తన ఆనందాన్ని వ్యక్తపరచారు. అంతేకాదు సీఎం జగన్‌ ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రంగా మా 'ఆటో రజని' ఎప్పటికి నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాము చేసిన 'జననేత జగనన్న' పాట గురించి ప్రత్యేకంగా జగనన్న అభినందించడం జీవితంలో మర్చిపోలేమంటు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక తన మొదటి సినిమాని ఆదరించినట్టుగానే ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని చెప్పారు. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలవుతుందని వెల్లడించారు. హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణల పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. ఇక హీరో జొన్నలగడ్డ శ్రీనివాస్ టాలీవుడ్ లో యూత్ హీరోగా మంచి మాస్ ఇమేజ్ సంపాదించుకోవడానికి మిగతా యంగ్ హీరోలతో పోటి పడటానికి ఎంతగానో ట్రై చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: