మహేష్ ను వెంకటేష్ తమ్ముడుగా భావిస్తాడు మహేష్ కూడా వెంకటేష్ ను అదేవిధమైన ప్రేమను వ్యక్త పరుస్తూ ఉంటాడు. ఇలాంటి సాన్నిహిత్యం ఉన్న వెంకటేష్ కారణంగా మహేష్ అల్లు అర్జున్ ల మధ్య అనవసరపు రగడ ఏర్పడటం ఎవరు ఊహించని విషయంగా మారింది. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే వెంకటేష్ చైతు నటిస్తున్న ‘వెంకీమామ’ సినిమాను 18 కోట్ల వరకు అమ్మాలని జరిగిన ప్రయత్నాలు మహేష్ బన్నీల చిచ్చుకు కారణం అని అంటున్నారు. ‘వెంకీ మామ’ సినిమాను 18 కోట్లకు కొనడం తమకు అభ్యంతరం లేదనీ అయితే ఈ మూవీని డిసెంబర్ లో కాకుండా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని చాలామంది బయ్యర్లు ఈ మూవీ నిర్మాత సురేశ్ బాబుకు సూచించినట్లు తెలుస్తోంది. 

దీనితో సురేశ్ బాబు సంక్రాంతికి ‘వెంకీ మామ’ ను తీసుకు రావడానికి తన  చేతిలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ధియేటర్లు కాకుండా తనకు పరిచయం ఉన్న ధియేటర్లతో ముందుగా మాట్లాడుతున్న విషయాలు బయటకు లీక్ అయ్యాయి అని తెలుస్తోంది. దీనితో షాక్ అయిన అల్లు అర్జున్ మరోక్షణం ఆలోచించకుండా తన మూవీ ‘అలా వైకుంఠపురంలో’ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే వెంటనే ఎలర్ట్ అయిన మహేష్ తన ‘సరిలేరు నీకెవ్వరు’ డేట్ ను రాత్రికి రాత్రి ప్రకటించినట్లు తెలుస్తోంది. 

దీనితో ఇప్పుడు ‘వెంకీ మామ’ ను విడుదల చేయాలి అంటే ఆదివారం అయినప్పటికీ సంక్రాంతి పండుగ రోజు అయిన జనవరి 15న విడుదల చేయాలి. అయితే తీవ్రమైన ధియేటర్ల కొరత ఏర్పడుతుంది కాబట్టి ఈ మూవీని వెంకటేష్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 13న కానీ లేదంటే డిసెంబర్ 25న కానీ విడుదల చేయడానికి తప్ప ప్రస్తుతానికి ఈ మూవీ నిర్మాతలకు మరో మార్గం లేకుండా పోయింది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: