సంక్రాంతి సీజన్ అంటే సినిమాల పండుగ అన్నట్టే.. ఎప్పటిలానే 2020 సంక్రాంతికి స్టార్ సినిమాలు పోటీ పడుతున్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఒకేరోజు పోటీగా రిలీజ్ అవుతున్నాయి. జనవరి 12న ఈ సినిమాల రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఎనౌన్స్ అయితే చేశారు కాని ఒకే డేట్ కు రెండు సినిమాలు వస్తాయా అన్నది తెలియాల్సి ఉంది.


ఇదిలాఉంటే ఇప్పటికే జనవరి 10న సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇవి చాలదు అన్నట్టుగా విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ వెంకీమామ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అసలైతే ఈ సినిమాను దసరా బరిలో దించాలని అనుకున్నారు.  


కాని సైరా రిలీజ్ అవుతుందని వెనక్కి తగ్గారు. అయితే మధ్యలో పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి అవకపోవడం వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేశారు. నవంబర్, డిసెంబర్ లలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కాని వెంకీమామాని పొంగల్ కు రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.


ఈ సినిమాలతో పాటుగా నందమూరి కళ్యాణ్ రాం ఎంతమంది వాడవురా సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వచ్చిన శతమానం భవతి సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తో ఎంత మంచివాడవురా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది ముందుకు ఏది వెనక్కి తగ్గుతాయో కాని ఈసారి సంక్రాంతికి సినిమా లవర్స్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: