ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సంక్రాంతికి పోటీ ఉండటం సహజమే. ఇక తెలుగులో సినిమాలకు సంక్రాంతి అతిపెద్ద సీజన్ కావడంతో గత నాలుగైదు దశాబ్దాలుగా పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగుతున్నాయి. గత నాలుగైదు ఏళ్లుగా చూస్తే ఏకంగా మూడు.. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతూ బాక్సాఫీస్‌ వారు హీటెక్కించేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే సంక్రాంతికి ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తో పాటు.... బన్నీ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అల వైకుంఠ‌పురంలో సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.


ఈ రెండు సినిమాలును సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ముందుగా మ‌హేష్ సినిమాను జనవరి 10 శుక్రవారం అనుకున్నా... ఈ సినిమాను ముందు తీసుకువ‌చ్చి... ఆ త‌ర్వాత బ‌న్నీ సినిమా వ‌స్తే దీనిపై బజ్ తగ్గిపోతుంది. పోనీ సరిగ్గా సంక్రాంతి టైమ్ లో రిలీజ్ చేద్దామంటే ముహూర్తం సెట్ అవ్వలేదు. దీంతో 12వ తేదీ ఆదివారం థియేటర్లలోకి రావాలని నిర్ణయించారు. ఇలా రెండు సినిమాలు ఒకే రోజు వ‌స్తున్నాయి.


ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే ఇప్పుడు మ‌రో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ఆ తేదీని చాన్నాళ్ల కిందటే లాక్ చేశాడు. ఇతడు కూడా జనవరి 12కే రాబోతున్నాడు. శ‌త‌మానం భ‌వ‌తి డైరెక్ట‌ర్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఎంత‌మంచివాడ‌వురా సినిమా సైతం అదే రోజు వ‌స్తే ఇక బాక్సాఫీస్ వార్ ఎలా హీటెక్కుతుందో తెలిసిందే. సంక్రాంతి బరిలో ఇలా 3 పెద్ద సినిమాలు ఒకే తేదీకి రావడం ఇదే తొలిసారి.


అదే రోజు మూడు పెద్ద సినిమాలు వ‌స్తే స‌రైన థియేట‌ర్లు లేక వీక్ సినిమాల‌కు దెబ్బ ప‌డ‌డం ఖాయం. ఇక ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్ వీటికంటే ముందే వ‌స్తోంది. ఈ సినిమాకు సైతం కొన్ని థియేట‌ర్లు ఇవ్వాలి. ఇక ఈ సినిమాలు అన్ని సంక్రాంతికి ఒకే రోజు వ‌చ్చి మార్కెట్ నాశ‌నం చేసుకోవ‌డం కంటే కాస్త ఆలోచించుకుని రిలీజ్ చేస్తే మంచిదేమో..!



మరింత సమాచారం తెలుసుకోండి: