బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ 2020 జూలైలో రిలీజ్ చేయాలనే లక్ష్యం తో జక్కన్న వేరే ఆలోచన లేకుండా ఆర్.ఆర్.ఆర్ కోసం శ్రమిస్తున్నారు. బాహుబలి మాదిరిగా ఒక్కో సీన్ ని ఉలితో చెక్కడమే పనిగా పెట్టుకున్నారని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. దసరా, జక్కన్న బర్త్ డే వెళ్లినా ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఏదో ఊహించుకున్నంతవరకు ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ఇది అయితే ఎలా ఉంటుంది అన్నట్టుగా.. రామ రౌద్ర రుషితం అన్న టైటిల్ ని రివీల్ చేశారు. కానీ ఆ టైటిల్ కి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో సైలెంట్‌గా ఉన్నారు. 

ఇదిలా ఉండానే రాజమౌళికి, ఆర్.ఆర్.ఆర్ హీరోలు ఒక్కొక్కరికి ఎంత రెమ్యునరేషన్ అందుతోంది...? అంటూ ఫిల్మ్ నగర్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ - తారక్ లకు ఒక్కొక్కరికి 30 కోట్లు పైగా రెమ్యునరేషన్ అందుతోందని ప్రచారమవుతోంది. అయితే వీళ్ళ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా బరిలో దిగారు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ చరణ్ - తారక్ లకు మించి ఇస్తున్నారని తెలుస్తోంది.  అజయ్ దేవగన్ పాత్ర ఆర్.ఆర్.ఆర్ లో ఎంతో కీలకంగా ఉంటుందట. అందుకే ఆయన ఏకంగా 35కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసారని టాక్ నడుస్తోంది. ఆ రెమ్యునరేషన్ కి తగ్గట్టుగానే దేవగన్ పాత్ర ఉంటుందట. ఈ విధంగా చూస్తే కేవలం ఈ ముగ్గురు స్టార్లకు ఇచ్చే పారితోషికాలే 100 కోట్లు అని అర్థమవుతోంది. 

ఇక రాజమౌళి ప్యాకేజీ ఎంత ఉంటుందో అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా చూస్తుంటే దాదాపు 350కోట్ల బడ్జెట్ తో ఆర్.ఆర్.ఆర్ నిర్మిస్తున్నామని నిర్మాతలే ఇన్‌డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారని తెలుస్తోంది. డి.వి.వి.దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్. లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా నటిస్తున్నారు. ఇంతకముందు బల్గెరియా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ షూటింగ్ జరుపుతున్నారు. త్వరలోనే టైటిల్ ప్రకటన ఉంటుందని ఇప్పటికే చిత్ర బృందం నుండి సంకేతాలు అందుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: