అక్కినేని కుటుంబ కోడలుగా సమాజంలో ఒక ఉన్నత స్థానానికి సమంత ఎదిగినా ఇంకా జీవితంలో చాలాచాల సాధించాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా విపరీతంగా పెరిగిపోవడంతో ఈ వెబ్ సిరీస్ ల ద్వారా డబ్బుతో పాటు తన క్రేజ్ ను కొనసాగించాలని సమంత ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ లకు శ్రీకారం చుట్టింది. 

ఈప్రయత్నాలు చాలవు అన్నట్లుగా సమంత తనకోసం ఏర్పాటు చేసుకున్న ఒక స్పెషల్ టీమ్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. సాధారణంగా సమంత తాను ఏదైనా పెళ్ళికి కానీ ప్రవేట్ ఈవెంట్ కు కాని చక్కగా మేకప్ చేసుకుని వెళుతున్నప్పుడు తన లుక్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తుంది. 

ఈఫోటోలకు సమంత అభిమానుల నుండి ప్రశంసలతో పాటు లైక్స్ కూడ వస్తున్నాయి. అయితే సమంత తాను షేర్ చేసే ఫోటోలు మరింత ఆకర్షనీయంగా ఉండటం కోసం ముంబాయ్ నుండి ఒక స్పెషల్ టీమ్ ను రప్పించినట్లు టాక్. వీరి కోసం సమంత భారీగానే ఖర్చు పెడుతోంది. 

ఆ టీమ్ లో డ్రెస్ డిజైనర్ మేకప్ మెన్ ప్రోఫిషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నట్లు సమాచారం. వీరి సహకారంతో సమంత తన లుక్ కు సంబంధించిన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తనకు పెళ్ళి అయినా తన గ్లామర్ ఏమి తగ్గిపోలేదు అని దర్శక నిర్మాతలకు సంకేతాలు ఇవ్వడానికి ఈ వ్యూహం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా సమంత పడుతున్న పాట్లు చూసి నాగార్జున దృష్టి వరకు వెళ్ళడంతో నాగ్ షాక్ అయినట్లు సమాచారం. మరి కొందరైతే ఈ వార్తలు విని చైతన్యకు కూడ ఇలాంటి టీమ్ ను ఏర్పాటుచేస్తే బాగుంటుంది కదా అంటూ జోక్ చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: