బిగ్ బాస్ సీజన్ 3 నుండి మహేష్ విట్ట ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్ లో మహేష్ బయటకు వచ్చేశాడు. ఇక కేవలం 3 వారాలు మాత్రమే ఉన్న ఈ షోలో ఇంకా ఎవరు బయటకు వస్తారో చూడాలి. ఫన్ బకెట్ లో కామెడీతో మెప్పించిన మహేష్ ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశం తెచ్చుకున్నాడు. 


బిగ్ బాస్ హౌజ్ లో దాదాపుగా మహేష్ ఒక కామన్ మెన్ లానే ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. తెర మీద కామెడీ చేసే మహేష్ పర్సనల్ లైఫ్ లో సీరియస్ గా ఉంటాడని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే టైంలో పంచె కట్టుతో వచ్చాడు మహేష్. నిన్న ఎలిమినేట్ అయ్యే టైం లో కూడా అదే పంచెతో కనిపించాడు.


సో ఎలా అయితే పంచెతో వచ్చాడో.. అలానే పంచె వేసుకుని హౌజ్ నుండి బయటకు వెళ్లాడు మహేష్. తాను ఇన్ని వారాలు ఉండటమే గొప్ప అన్నట్టుగా భావిస్తున్నా మహేష్. ఒకవేళ తనకు టైటిల్ వచ్చినా దానికి నేను అర్హుడిని కాదని చెప్పడం అతని అమాయకత్వం అనుకోవాలా.. గొప్పతనం అనుకోవాలో తెలియట్లేదు.


ఇక ఇదిలాఉంటే మహేష్ ఎలిమినేట్ అయిన తర్వాత ఈరోజు నామినేషన్ ప్రక్రియ మరింత సీరియస్ గా జరుగుతుందని చెప్పొచ్చు. 1 నుండి 7 వరకు ర్యాంకులు ఇచ్చి ఎవరికి ఏ స్థానం లభిస్తే వారు ఆ స్థానంలో నిలబడాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే వాళ్లను అడిగి స్థానాలు మార్చుకునే అవకాశం ఉంటుంది. అలా బిగ్ బాస్ హౌజ్ లో ఈవారం నామినేషన్ ప్రక్రియ మరింత రసవత్తరంగా మారుతుంది. మరి ఈరోజు నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: