తెలుగులో హిట్టైన సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లో బడ్జెట్ సినిమాలు హిట్ అవడమే ఆలస్యం బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ హక్కులను కొనేస్తున్నారు. భారీ సినిమాలకు ఎలాగు హిందిలో కూడా రిలీజ్ చేసే ఆలోచన ఉంటుంది. రెండేళ్ల క్రితం వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం అందుకుంది.


ఆ సినిమాను అదే దర్శకుడు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అని తీసి హిట్ కొట్టాడు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని షాహిద్ కపూర్ కబీర్ సింగ్ తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇదిలాఉంటే ఇప్పుడు షాహిద్ కపూర్ మళ్లీ తెలుగు సూపర్ హిట్ సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.


నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ. ఈ సినిమాను హిందిలో రీమేక్ చేస్తున్నారట. మాత్రుక దర్శకుడు గౌతం తిన్ననూరి బాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. అల్లు అరవింద్, దిల్ రాజుతో పాటుగా బాలీవుడ్ నిర్మాత ఒకరు ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.


జెర్సీ సినిమా కచ్చితంగా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. నానికి ఈ ఇయర్ మొదటి హిట్ ఇచ్చిన సినిమా జెర్సీ. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ అని వచ్చాడు కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. మరి నాని జెర్సీ చూసేశాం.. ఇక షాహిద్ కపూర్ జెర్సీ ఎలా ఉండబోతుందో చూడాలి. చూస్తుంటే షాధి కపూర్ వరుసగా తెలుగు హిట్ సినిమాలతో బాలీవుడ్ లో తను కోల్పోయిన ఫాం తిరిగి తెచ్చుకునేలా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: