విలక్షణ నటుడుగా ప్రస్తుత తరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో రాజేంద్రప్రసాద్ హవా బాగా కొనసాగుతోంది. సోడాల రాజు పాత్రలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన ‘తోలుబొమ్మలాట’ మూవీ విడుదలకు రెడీ అయింది. నవంబర్ లో విడుదల కాబోతున్న ఈ మూవీని ప్రమోట్ చేస్తూ జరిగిన ఫంక్షన్ లో రాజేంద్రప్రసాద్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

‘ఆనలుగురు’ సినిమా తరువాత తాను ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగలను అన్న ధైర్యం తనకు పెరిగిన విషయాన్ని వివరిస్తూ అయితే ఈ మూవీలోని సోడాల రాజు పాత్ర విన్న తరువాత ఈ మూవీ కథ తనను ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని నటించమని హెచ్చరికలు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు తాను ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తన చిన్నతనంలో 5 పైసలకు సోడా తాగిన రోజులు గుర్తుకు వచ్చాయని అంటూ ప్రస్తుతం 5 పైసలు ఎక్కడైనా కనిపిస్తుందా అని తాను అనేకచోట్ల వెతికిన విషయాన్ని నవ్వుతూ బయటపెట్టాడు.

ఈ మూవీలో తాను నటుడు నారాయణరావుతో కలిసి నటించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు నారాయణరావు గత 45 సంవత్సరాలుగా మిత్రుడుగా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి అని అంటూ ప్రశంసలు కురిపించాడు.  మనిషికీ మనిషికీ ఉండే సంబంధాలను స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని తెలియ చేసే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడుతున్నాడు.

యంగ్ డైరెక్టర్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కథ ఉదాత్తమైన పాత్రలు చుట్టూ తిరుగుతుంది. ఈ మధ్య కాలంలో పూర్తి సెంటిమెంట్ తో కూడిన సాఫ్ట్ మూవీలు రాని నేపధ్యంలో ఈ మూవీకి సరైన రిలీజ్ డేట్ దొరికితే టాలీవుడ్ ఇండస్ట్రీకి విశ్వనాథ్ పేరుతో మరో మంచి దర్శకుడు దొరికడమే కాకుండా మంచి కథలతో కూడిన సినిమాలు ఇతడి వద్ద నుండి వచ్చే ఆస్కారం ఉంది అని అనుకోవాలి..
 



మరింత సమాచారం తెలుసుకోండి: