బాలీవుడ్ లో టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్ ‘బాలికా వధూ’. ఈ సిరియల్ తెలుగు ‘చిన్నారి పెళ్లి కూతురు’ గా డబ్బింగ్ చేసేవారు. ఈ సీరియల్ హిందీలో, తెలుగులోనూ పాపులర్ అయ్యింది.  దాంతో అవికా గోర్ కి మంచి క్రేజ్ రావడంతో సినిమాలవైపు చూపు మళ్లింది.  ఈ నేపథ్యంలో 'ఉయ్యాల జంపాల' తో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.  ఈ మూవీతో హీరోగా రాజ్ తరుణ్ వెండి తెరకు పరిచయం అయ్యాడు.  తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ సినిమా సూపిస్త మావా కూడా మంచి విజయం అందుకుంది.   

తర్వాత తెలుగులో రెండు మూడు మూవీస్ లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో తెలుగు సినీ పరిశ్రమకు కొంత కాలం దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా  'రాజు గారి గది3' తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఈ బ్యూటీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.  ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవికా గోర్ మాట్లాడుతూ..తెలుగు లో మళ్లీ ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని..ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ నా నటనను అభినందిస్తారని అన్నారు.

హింది బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాస్స్ వస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు, కంటెస్టెంట్ గా మాత్రం వెళ్ళే ఉద్దేశ్యం లేదని అలా అయితే తను ఎన్నో ఏళ్లుగా కలర్స్ చానెల్ లో పనిచేస్తున్నానని ఆ దారి తనకి తనకి చాలా సులువని అని చెప్పింది. హిందీ 'బిగ్ బాస్' షో కి హోస్ట్ చేయడం తన డ్రీం అని చెప్పింది. ఒక వేళ తనకి అంతటి హోదా వస్తే అదే తనకి కెరీర్ లో ఎక్కువ సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చింది.  తెలుగులో మరో సైన్ చేసినట్టు చెప్పిన ఈ ముద్దుగుమ్మ మరో పదిహేను రోజుల్లో ఆ సినిమా గురించి చెప్తానని అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: