ఈ మద్య చిన్న సినిమాలు ట్రైలర్ తోనే యుత్ ని కట్టిపడేసేలా ఉంటున్నాయి.  తీరా థియేటర్లోకి వెళ్లి చూస్తే ఊహించినదానికన్నా ఘోరంగా ఉంటున్నాయి.  టీజర్, ట్రైలర్ లో ముద్దు సీన్లు, బెడ్ రూమ్ సీన్లు..ఇంకా బూతు సీన్లు ఎన్నో చూపిస్తుంటారు..దాంతో ఇక సినిమా లో ఎంత మత్తు ఉంటుందో అని అభిప్రాయంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తుంటారు.  తీరా సినిమాలో రెండు మూడు సీన్లు తప్ప ఏమీ స్టఫ్ లేదని చూసి నిరాశ చెందుతుంటారు.  ఈ మద్య ఇదో ట్రెండ్ గా కొనసాగుతుంది.

తాజాగా అభిషేక్ పచ్చిపాల, భాను శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఏడు చేపల కథ’ చిత్ర ట్రైలర్‌ను వదిలింది చిత్ర యూనిట్. బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ లీడ్ రోల్‌లో అభిషేక్ రెడ్డి, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. పక్కా బూతు కంటెంట్‌తో మూడు నిమిషాల నిడివితో చిన్న సైజు సెక్స్ సినిమాను చూపించేశారు.  భాను శ్రీ విలన్ అయిన ‘సుందర్ నీకొక కథ చెప్తా.. ఏడు చేపల కథ.. చిన్న పిల్లలకు చెప్తారే ఆ కథ కాదు’ అంటూ ఈ బూతు సినిమాను చూపిస్తుంది.

ఈ మూవీలో హీరోయికి ఒక వ్యాధి ఉంటుంది..దానికి ప్రతి నెల అతనికి బ్లెడ్ కావాలి..అందుకోసం  ఏడు చేపల్లాంటి అందగత్తెలతో కామకేళిలో తేలియాడుతున్నాడు. తనకు చిక్కిన ‘ఏడు చేపల కథా’ కార్యక్రమాలను పూసగుచ్చినట్టు చెప్పి 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో టెంప్ట్ చేసిన టెంప్ట్ రవి మళ్లీ ట్రైలర్‌‌తో ఆ మూవీని చూపిస్తున్నాడు.  ఈ ట్రైలర్ అశ్లీలత, అసభ్యకరమైన సంభాషణలు ఇందులో చాలా ఉన్నాయ్...మరి సినిమాలో ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: