ఒకప్పుడు సంక్రాంతి హీరోలంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అని ఫిక్స్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా బాలయ్య దే సంక్రాంతి అని చెప్పాలి. అందుకే ప్రతి  సంక్రాంతికి బాలయ్య సినిమాలు  రిలీజ్ అయ్యి సూపర్ హిట్ ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించేవి. అలా సంక్రాంతికి రిలీజైన బాలయ్య సినిమా 100 రోజులు..175..200 డేస్ కూడా ఆడిన సినిమాలున్నాయి.  అందుకే అప్పట్లో ప్రతి సంక్రాంతికి ఒక సినిమా ఉండేలా బాలయ్య ప్లాన్ చేసుకునేవారు. కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తుందనుకున్న బాలయ్య, కేఎస్ రవికుమార్ చౌదరీల సినిమా 2020 సంక్రాంతి సీజన్ లో రాదంటు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. సంక్రాంతి ముందు క్రిస్మస్ సీజన్ లో కానీ లేదంటే సంక్రాంతి తర్వాత కానీ బాలయ్య తన సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట. అందుకు స్ట్రాంగ్ రీజన్ కూడా ఉందని తెలుస్తోంది.

ఈ మధ్య బాలయ్య నటించిన డిక్టేటర్ - ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అందుకే బాలయ్య ఆలోచనలో పడ్డట్టు తాజా సమాచారం. అంతేకాకుండా ఇద్దరు యువ హీరోల సినిమాలు ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కి వస్తున్నాయని అనౌన్స్ చేయడంతో తన సినిమాని సంక్రాంతి ముందు కానీ తర్వాత కానీ రిలీజ్ చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతుంది. 

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రీసెంట్‌గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతుంది. ఇక బన్నీ-త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కి ట్రై చేస్తున్న అల వైకుంఠపురములో కూడా 12నే విడుదల చేయాలని నిర్ణయించాడు. కాబట్టే బన్ని కూడా అదే రోజు రావాలని డిసైడయ్యాడు. అందుకే మహేష్ తో పోటీగా బన్ని కూడా డేట్ ని అనౌన్స్ చేస్తు పోస్టర్ ని రిలీజ్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలతో పోటీగా ఇదే రోజుకు కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా వస్తోంది. ఇక సూపర్ స్టార్ దర్బార్ కూడా సంక్రాంతి సీజన్ లోనే రాబోతోంది. మరి ఇన్ని సినిమాలతో ఎందుకు పోటి అనుకున్నారేమో బాలయ్య ముందుగాని వెనకగాని రావాలని డిసైడయ్యారని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: