నిన్న అమరావతి దగ్గర ఉన్న తాడేపల్లి లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్ళిన చిరంజీవి దంపతులు కలవడం కేవలం మర్యాదపూరకమైన భేటీ మాత్రమే కాదనీ వీరిద్దరి చర్చలలో వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడ దాదాపు గంట సేపు జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు టాక్. 

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో ‘సైరా’ బయ్యర్ల నష్టాల నుండి గట్టెక్కించే ఉద్దేశ్యం కూడ అంతర్లీనంగా ఉంది అన్న గాసిప్పులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి ఈ భేటీలో నేరుగా జగన్ ను ‘సైరా’ కు వినోదపు పన్ను రాయితీ ఇమ్మని అడగక పోయినా ఇలాంటి మంచి సినిమాలు రావాలి అంటే ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ విషయంలో సహకరిస్తే చాల మంచి సినిమాలను ధైర్యం చేసి నిర్మాతలు తీస్తారు అని సూచన ప్రాయంగా అన్నట్లు టాక్.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ స్థిర పడటానికి తనవంతు సహకారం చేస్తానని చిరంజీవి జగన్ కు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య రాజాకీయాలకు సంబంధించి ఒక్క విషయం కూడ చర్చకు రాకపోయినా వీరి సంభాషణలు అన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి గురించి అదేవిధంగా ‘సైరా’ మేకింగ్ గురించి మాటలు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి ‘సైరా’ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని వినోదపు పన్ను విషయంలో రాయితీ ఇస్తే సినిమాలు అదేవిధంగా కళలు రాజకీయాలకు అతీతం అన్న సందేశం జగన్ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తూ జగన్ కు  ‘సైరా’ కు వినోదపు పన్ను రాయితీ ఇమ్మని చెప్పడానికి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ‘సైరా’ కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా అని భయపడుతున్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ‘సైరా’ బయ్యర్లకు ఒక శుభవార్త అనుకోవాలి. నిజంగానే జగన్ ‘సైరా’ కు వినోదపు పన్ను రాయితీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగ అభివృద్ధికోసం జగన్ ఎంత శ్రద్ధ చూపెడుతున్నారు అన్న విషయం తెలియడమే కాకుండా సినిమాలకు కళలకు సంబంధించి పార్టీలకు అతీతంగా తాను అందరివాడిని అన్న సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: