తెలుగు చలన చిత్ర పరిశ్రమ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేవి చాలా ఉంటాయి. దాదాపుగా ఎనభయ్యేళ్ళ చరిత్ర కలిగిన టాలీవుడ్లో ఎందరో సేవ అందించారు. ఆ కళామతల్లి ఆరాధనలో ఎందరో తరించారు. ఎందరి క్రుషి ఫలితమో టాలీవుడ్ ఈనాటి ఉన్నత స్థితి. అయితే పేరు మాత్రం కొందరికే వచ్చింది. వారే టాలీవుడ్ పెద్దలు అన్న భ్రమలు, భ్రాంతులు కలిగేలా నాడు కధ అలా సాగిపోయింది.


ఎపుడైతే చిరంజీవి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మేరు నగధీరుడిగా, మెగాస్టార్ గా తన విశ్వరూపం చూపించారో నాటి నుంచి టాలీవుడ్లో కమ్మ సామాజికవర్గ  ఆధిపత్యానికి కొంత బ్రేక్ పడింది. ఇపుడు మెజారిటీ మెగా ఫ్యామిలీ హీరోలే రాజ్యం చేస్తున్నారు. దాంతో టాలీవుడ్లో కాపు సామాజికవర్గం హవా అధికంగా ఉందనే చెప్పాలి. అయితే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలు, వ్యవహారాలు చూసే పెద్దలుగా ఇంకా కమ్మ సామజికవర్గం ఆధిపత్యం చేస్తూ వచ్చింది. ఆ విధంగా తన పెద్దరికం చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక సినీ నటుడు, అదే సామాజికవర్గానికి చెందిన అన్న నందమూరి తెలుగుదేశం ఏర్పాటు చేయడంతో రాజకీయంగా కూడా కమ్మలు బలంగా కనిపించారు. కొన్ని దశాబ్దాలు అంటు సినీ రంగంలోనూ ఈ దూకుడు కనిపించింది.


ఇపుడు రాజకీయాల్లో తెలుగుదేశం వెనకబడడం, ఉమ్మడి ఏపీ చీలిపోవడం, రెండు చోట్ల కమ్మేతర రాజకీయ నాయక‌త్వం అధికారంలోకి రావడంలో మునుపట్లా టాలీవుడ్లో కమ్మల ఆధిపత్యం సాగడంలేదు. ఇక కేసీయార్ తో కొంత సాన్నిహిత్యం నెరుపుతూ తమ ఆధిపత్యం చూపించుకుంటున్న కమ్మ వారికి ఏపీలో జగన్ సీఎం కావడం గిట్టడంలేదన్న ప్రచారం ఉంది. దాంతో కనీసం జగన్ని అభినందించేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఎదురైంది. ఇపుడు టాలీవుడ్ పెద్దగా  ఉన్న చిరంజీవి ఏకంగా జగన్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కంగ్రాట్స్ చేయడంతో టాలీవుడ్ కే పెద్ద దిక్కుగా మెగాస్టార్ మారిపోయాడని చెప్పాలి. టాలీవుడ్లో రాజకీయ పట్టింపులు, కుల సమీకరణలతో సమస్యలను సైతం కుళ్ళబెడుతున్న ఓ వర్గం ఆధిపత్యానికి మెగాస్టార్ ఇలా చెక్ పెట్టారని చెప్పాలి.


ఇపుడు టాలీవుడ్ నుంచి చిరంజీవినే పెద్దగా జగన్ గుర్తిస్తున్నారు. చిరంజీవి ముఖతహా ఏ సమస్య చెప్పినా తాను పరిష్కరించగలనని పూర్తి హామీ ఇచ్చేశారు. ఈ తాజా పరిణామంతో టాలీవుడ్లో బ్యాక్ సీడ్ డ్రైవింగ్ చేసే మరో బలమైన  సామాజిక వర్గం ఆధిపత్యానికి పూర్తిగా గండిపడినట్లైంది. జగన్ని సీఎం గా గుర్తించమని కూర్చున్న ఆ వర్గం ఇపుడు చిరంజీవి పక్కన చేరి జగన్ని ప్రసన్నం చేసుకుంటుందా, లేక మరింతగా వెనకబడుతుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: