టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు తమ మాటల  రచయితలుగా పేరు తెచ్చుకున్నారు పరుచూరి బ్రదర్స్. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవాడు..పరుచూరి గోపాలకృష్ణ చిన్నవాడు.  ఈ అన్నదమ్ములు ఇప్పటికీ ఎంతో అనుబంధంగా ఉంటారు. అన్నదమ్ములిద్దరు 333 పైగా మూవీస్ కి డైలాగులు రాశారు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు లేడీ అమితాబచ్చన్ గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి.  90 లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించింది.  తర్వాత రాజకీయాల్లోకి వచ్చి సిని పరిశ్రమకు దూరమైంది. 

చాలా సంవత్సరాల తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తుంది. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   'అపూర్వ సహోదరులు' సినిమా షూటింగ్ మైసూర్ ప్యాలెస్ లో జరుగుతుండగా, వేరే సినిమా సిట్టింగ్ కోసం అక్కడ నేను రాఘవేంద్రరావుగారిని కలిశాను. ఆ సమయంలో విజయశాంతి అమ్మగారు చనిపోయారు. షూటింగ్ మద్యలో ఈ విషాద సంఘటన జరిగింది.

అయితే అసలు విషయం విజయశాంతికి చెప్పకుండా చెన్నైలోని ఆమె ఇంటికి తీసుకెళ్లమని రాఘవేంద్రరావుగారు చెప్పారు. ఆ సమయంలో నా సతీమణి నా వెంటనే ఉంది. ఇద్దరం కలిసి విజయశాంతిని ఆమె ఇంటికి తీసుకు వెళ్లి ఓదార్చాం.  ఈ మద్య విజయశాంతిని కలిసినపుడు ఈ సంఘటన గుర్తు చేసుకొని చాలా బాధపడిందని చెప్పారు. నిజంగానే ఆ విషాద సంఘటన నా జీవితంలో మర్చిపోలేనని అన్నారు  పరుచూరి గోపాలకృష్ణ. 


మరింత సమాచారం తెలుసుకోండి: