టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇటీవల రిలీజ్ అయిన నోటా, టాక్సీ వాలా, డియర్ కామ్రేడ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డారు. అందుకే ఇకపై తాను చేయబోయే సినిమాల విషయమై ఎంతో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఈ రౌడీ హీరో, ప్రస్తుతం ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఒక సినిమా, అలానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో పూరి తెరకెక్కించబోయే తాజా సినిమాలో కూడా హీరోగా నటించబోతున్న విజయ్, 

రేపు 11 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ వివాంట హోటల్ లో హాలీవుడ్ మూవీ 'టెర్మినేటర్ డార్క్ ఫేట్' ట్రైలర్ ఆవిష్కణ చేయబోతున్నాడు. కొన్నేళ్ల క్రితం టెర్మినేటర్ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ఆమోదంతో మంచి సక్సెస్ లు సాధించాయి. ఇక ఆ సిరీస్ లో ఇటీవల వచ్చిన టెర్మినేటర్ జెనెసిస్ సినిమా కూడా మంచి సక్సెస్ అవడంతో, నవంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా టెర్మినేటర్ సిరీస్ సినిమా డార్క్ ఫేట్ పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సిరీస్ లోని మొదటి భాగం నుండి వరుసగా నటిస్తూ వస్తున్న యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మరియు లిండా హామిల్టన్ జోడి, ఈ సినిమాలో కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. 

అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాను ఇంగ్లీష్ భాషతో పాటు మనదేశంలోని ఆరు ప్రాంతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక రేపు ఉదయం ఎంతో వేడుకగా జరుగనున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి విజయ్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం. మరి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: