కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ కామెంట్ల రూపంలో తన అస్త్రాలను సంధిస్తోంది. అయితే ఆమె పెడుతున్న ఈ కామెంట్లలో బూతు పురాణం ఎక్కువగా ఉండటంతో అవి వెంటనే వైరల్ అవుతున్నాయి.


ఇకపోతే సామాజిక అంశాలపై కూడా అప్పుడప్పుడు తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఫేస్‌బుక్ వేదికగా హద్దులు దాటి కామెంట్లు చేస్తున్న శ్రీ రెడ్డి సినీ, రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులను ఎంచుకొని మరీ టార్గెట్ చేస్తోంది. గతంలో తేజ, ఇలియానా, బోయపాటి శ్రీను లాంటి బడా సినీ ప్రముఖల పేర్లు వాడేసిన ఈమె ఇటీవల విశాఖలో కంచరపాలెంలో సెక్స్ రాకెట్‌ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసుల మీద పడ్డది. వివరాల్లోకి వెళ్లితే.


కంచరపాలెం మురళీనగర్‌‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా.. పోలీసులు దాడులు చేసి.. ముగ్గురు మహిళలు, ఇద్దరు యువతులు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఇష్యూపై స్పందిస్తూ.. వ్యభిచారం చేయడాన్ని సమాజ సేవగా అభివర్ణించింది శ్రీరెడ్డి. అంతేకాదు.. వేశ్యల్ని దేవతలో పోల్చుతూ తనదైన శైలిలో ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలింది. ‘వేశ్యలు అనేవాళ్లు లేకపోతే.. మీ చిన్నారి కూతుళ్లకు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి. కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు. ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు.


ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు’ అంటూ హెచ్చరిస్తోంది శ్రీరెడ్డి. అదీ గాక మరో పోస్ట్‌లో వ్యభిచారం చేస్తున్న వేశ్య ఆనందంగానే ఉంది.. విటుడు ఆనందంగానే ఉంటున్నాడు మధ్యలో ఈ క్రైం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ.. వ్యభిచారాన్ని సమర్ధిస్తూ వరుసగా పోస్ట్‌లు వదులుతోంది శ్రీరెడ్డి. అంతేకాదు.. వ్యభిచారం అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులకు చురకలేస్తోంది.. ‘మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మీరెప్పుడూ తప్పు చేయలేదని. అంటూ ప్రశ్నలు సంధిస్తోంది వివాదాల వయ్యారి. ఇకపోతే  తాజాగా ఈమె వైఎస్సార్ సీపీ యువనేతపై మనసు పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: