మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా కళ్ళు చెదిరే కలెక్షన్లు మరియు రికార్డులు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులు అయిపోయిన గాని సైరా సినిమా హాలు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక తెలంగాణలో ఇంకా దసరా సెలవులు ఉన్న క్రమంలో సైరా కి బీభత్సమైన కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో చిరంజీవి సినిమా హిట్ అయితే ఎలా ఉంటుందో అన్న విషయాన్ని సైరా సినిమా నిరూపిస్తోంది. గత కొంత కాలం నుండి మెగా కాంపౌండ్ కి సంబంధించిన పెద్ద పెద్ద హీరోల సినిమాలు రాక సరైన హిట్ లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పడక ఉండటంతో తీవ్ర నిరుత్సాహం లో ఉన్న మెగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టారు. మెగా అభిమానులకు కడుపు నింపి.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించాడు.

ఇటువంటి నేపథ్యంలో సినిమాకి వస్తున్న ఆదరణ చూసి చాలామంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు మరియు రాజకీయ నేతలు కూడా చిరంజీవి పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరో పక్క దేశం కోసం పోరాడిన యోధుడిగా తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి కర్నూలు జిల్లా కి చెందిన చరిత్రకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిప్రతిష్టలు దేశం మొత్తం తెలిసేలా చిరంజీవి అదిరిపోయే ప్లాన్ వేసి ఈ సినిమాని ప్రధాని మోడీ కి చూపించడానికి రంగం సిద్ధం చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులతో భేటీ అయిన చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర మరుగు పడిపోకుండా దేశం కోసం పోరాడిన యోధుడు వీరుడు కాబట్టి దేశం మొత్తం తెలుసుకునేలా సైరా సినిమా తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిప్రతిష్టలు పెంచడానికి శతవిధాల మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాకి వస్తున్న కలెక్షన్లు మెగాస్టార్ కెరియర్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు అని అందరికీ తెలిసినదే. కాగా సినిమా రిలీజ్ అయి 14 రోజులైనా క్రమంలో సినిమాకి వచ్చిన కలెక్షన్లు టాలీవుడ్ హిస్టరీలో మరియు చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు గా నిలిచాయి. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో లో సైరా 2.5 మిలియన్ మార్క్ దాటినట్లు నిర్మాత రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 14 రోజులకు దాదాపు 200 కోట్ల మార్క్ దాకా సైరా సినిమా కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కలు చూసి చాలామంది సైరా సినిమా చిరంజీవి కెరీర్లో మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో హిస్టారిక్ మార్క్ అతి తక్కువ సమయంలో క్రియేట్ చేసిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: