సంక్రాంతి కోడిపందాలు ఇంకా మొదలు కాకుండానే జనవరి 12న జరగబోతున్న మహేష్ బన్నీల వార్ లో ఎవరు విజేతలు అంటూ ఇప్పటి నుంచే అంచనాలతో పాటు పందాలు కూడ ప్రాంరంభం అయిపోయాయి. అభిమానుల సందడి ఇలా కొనసాగుతూ ఉంటే ఈ మూవీల నిర్మాతలు ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాత అనీల్ సుంకర ఈ వార్ గురించి తెగ భయపడిపోతున్నట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల అంచనాలు ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ మూవీ నిర్మాతలు ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాలలో కనీసం 40 కోట్ల రేషియోలో అమ్మకాలు జరిపినప్పుడు మాత్రమే ఈ మూవీ నిర్మాతలు లాభ పడగలుగుతారు. అయితే ఈ సంవత్సరం వచ్చిన ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాలలో సోలో రిలీజ్ గా విడుదలై 41 కోట్లు మాత్రమే తెచ్చుకుంది అన్న లెక్కలు వినిపిస్తున్నాయి. 

దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని కొనాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్లు వెనకడుగు వేస్తూ భారీ మొత్తాలలో అడ్వాన్స్ లు ఇవ్వడానికి అనేక రకాల ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అదేవిధంగా ‘అల వైకుంఠపురంలో’ పరిస్థితి చూసినా కొంత అయోమయంగానే ఉంది అని అంటున్నారు. బన్నీ ‘నా పేరు సూర్య’ సినిమా ఫెయిల్ అవ్వడంతో కేవలం 26 కోట్ల వరకు మాత్రమే తెచ్చుకుంది. దీనితో ఈ మూవీ పై 40 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్లు జంకుతున్నట్లు టాక్. 

దీనికితోడు ఈ రెండు సినిమాల మధ్య రజినీకాంత్ కళ్యాణ్ రామ్ ల సినిమాలు ఉండటంతో ఈసారి సంక్రాంతి రేస్ అత్యంత గందరగోళంగా ఉంది అని అంటున్నారు. సంక్రాంతి తెలుగు ప్రజలకు పెద్ద పండుగ అయినప్పటికీ నాలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఒకేసారి చూస్తారా అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో బన్నీ మహేష్ ల సినిమాలకు బయ్యర్లు ఏ మేరకు అడ్వాన్స్ లు కడతారు ? అన్న విషయమై టెన్షన్ నేలకున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులను గ్రహించిన మహేష్ భేషజాలు పోకుండా తన ‘సరిలేరు నీకేవ్వరును’ జనవరి 10న విడుదల చేసి టాప్ హీరోల్ మధ్య అనవసరపు పోటీ నివారించిన మనసున్న టాప్ హీరోగా ఇండస్ట్రీ పెద్దల నుండి మన్నలను పొందాలని ఇప్పటికే అనీల్ సుంకర ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: