టాలీవుడ్లో బడా నిర్మాణ సంస్థంగా గీతా ఆర్ట్స్ ఎంతో పేరుంది. అది 1974 ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంస్థ. అప్పటికే ప్రఖ్యాత నటుడిగా ఉన్న అల్లు రామలింగయ్య సమర్పణలో ఆయన కుమారుడు అల్లు అరవింద్ ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.  బంట్రోత్తు భార్య వంటి సినిమాలతో ప్రారంభించి తరువాత కాలంలో మెగా బ్యానర్ గా దీన్ని నిలబెట్టారు.


గీతా ఆర్ట్స్ అప్పట్లో కుటుంబ కధా చిత్రాలు తీసి మంచి పేరు సంపాదించింది. ఇక అల్లు వారి ఇంటి అల్లుడుగా చిరంజీవి అయ్యాక  గీతా ఆర్ట్స్ ఒక్కసారిగా టాప్ లిస్ట్ లోకి చేరిపోయింది.  మెగాస్టార్ తో వరసగా మూవీస్ చేసిన ఘనత కూడా ఈ బ్యానర్ దే. దాంతో సక్సెస్ రేట్ కూడా ఈ బ్యానర్ కి ఎక్కువ. ఎన్నో మంచి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గీతా ఆర్ట్శ్.


అటువంటి గీతా ఆర్ట్స్ ఇపుడు అల్లు రావి మూడవతరం వారసుడు, ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్తోందని అంటున్నారు. నిజానికి అల్లు అరవింద్ కి తన మూడవ‌ కుమారుడు శిరీష్ ని నిర్మాత చేయాలని ఉండేదట. అయితే నటన మీద మక్కువతో అల్లు శిరీష్ అటు వైపు మళ్ళడంతో ఇపుడు అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్య్తత‌లు చూస్తున్నారంటున్నారు. తన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురంలో మూవీ నిర్మాణంలో కూడా గీతా ఆర్ట్స్ ని భాగస్వామ్యంచేసిన అర్జున్ ఇక తన తరువాత చిత్రాలకూ అదే ట్రెండ్ కొనసాగిస్తారని అంటున్నారు.


అంతే కాకుండా మరో వైపు నిర్మాతగా చిన్న చిత్రాలు కూడా నిర్మిస్తారని అంటున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ ఇపుడు పక్కకు తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరో వైపు రాం చరణ్ కొణిదెల బ్యానర్లో సినిమాలు తీయడంతో అల్లు అర్జున్ కూడా తన సొంత ప్రొడక్షన్లో మూవీస్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇదొక కొత్త రకం కాంపిటేషన్ అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: