కోలీవుడ్ లో సూపర్ స్టార్ విజయ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు అక్కడే కాదు టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే.  గతంలో విజయ్ నటించిన సినిమాలు ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నాయి. మెర్సిల్ తెలుగు లో అదిరింది మూవీగా రిలీజ్ అయ్యింది. తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సైతం ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొని రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయ్యాయి.

తాజాగా ఇప్పుడు అట్లి దర్శకత్వంలో విజయ్ ‘బిగిల్’ సినిమాలో నటించాడు.  ఈ మూవీలో  ఫుట్ బాల్ కోచ్ గా, ఊర మాస్ వ్యక్తిగా రెండు పాత్రల్లో విజయ్ కనిపించబోతున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ వెర్షన్ కు సంబంధించి సెన్సార్ పూర్తయింది.   అయితే, 179 నిమిషాల రన్ టైమ్ తో సినిమా ఫైనల్ సెన్సార్ అయ్యింది.  గతంలో  'తెరి', 'మెర్సల్' వంటి భారీ విజయాలను అందించిన అట్లీ కుమార్ దర్శకత్వంలో మూడో సినిమాగా విజయ్ 'బిగిల్' చేస్తున్నాడు. 

ఈ మద్య ‘బిగిల్’ నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ 29 మిలియన్ల వ్యూస్ ను .. 2 మిలియన్ల లైక్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డును సృష్టించింది.   ఈ మూవీలో ఫుట్ బాల్ కోచ్ గా యంగ్ లుక్ తోను.. మాంసం వ్యాపారం చేసే మధ్యవయస్కుడి పాత్రలోను విజయ్ కనిపించనున్నాడు. గత కొన్ని రోజులుగా తమిళ్ స్టార్ల సినిమాలు తెలుగులో ఫెయిల్ అవుతున్నాయి.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.  తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార కనిపించనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: