వెంకటేష్ పేరుకు ముంది విక్టరీ అని ట్యాగ్ ఉంటుంది. అది కచ్చితంగా సార్ధకమయ్యే పేరు. ఎందుకంటే టాలీవుడ్ సీనియర్ హీరోలలో సక్సెస్ రేటింగ్ ఎక్కువ ఉన్న హీరో వెంకీయే. ఇక వెంకీ సెలక్షన్ కూడా బాగుంటుంది. ఆయన స్టోరీ  జడ్జ్మెంట్ కూడా అదుర్స్ అంటారు. తన ప్లస్ లు మైనస్ లు  బాగా తెలిసిన హీరో వెంకీ అందుకే ఆయనకు హిట్లు ఏ సీజన్లోనైనా ఉంటాయి. 


ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ టూ మూవీతో వచ్చిన వెంకీ ఇపుడు ఏకంగా సొంత మేనల్లుడు నాగ చైతన్యతో కలసి  వెంకీ మామగా వస్తున్నాడు. ఈ ఇద్దరు కలసి చేసిన ఈ మూవీకి డైరెక్టర్ బాబీ, హిలేరియస్ కామెడీతో కడుపుబ్బ నవ్వించే ఈ మూవీ కచ్చితంగా సంక్రాంతి హిట్ అన్న మాట వినిపిస్తోంది. 


ఈ మూవీని సంక్రాంతి రోజే రిలీజ్ చేయడం ద్వారా మంచి టైమింగ్ ఎంచుకున్నారని అంటున్నారు. ఈ ఏడాది కూడా వెంకీ పండగ వేళనే వచ్చాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇపుడు కూడా అదే థియరీ ఫాలో అవుతున్నాడు. ఇక వెంకీ మూవీస్ విషయానికి వస్తే ఆయనకు సంక్రాంతికి హిట్లు చాలానే ఉన్నాయి. అందులో పెద్ద హిట్ చంటి మూవీ.


తరువాత ఎఫ్ టూ మూవీ. ఇక ఈసారి సంక్రాంతికి ముందే కర్చీఫ్ వేసేసిన మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా జనవరి 12 నే డేట్ గా ఎంచుకోవడం కూడా వెంకీ మామకు కలసి వస్తుందని అంటున్నారు. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కావడంతో  సంక్రాంతి పండుగ ఈసారి అదిరిపోతుందని అంటున్నారు. మరి చూడాలి ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే సంక్రాతి రాజుగా వెంకీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: