మాములుగా అయితే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత ఆల్మోస్ట్ కెరియర్ క్లోజ్ అయినట్టే. ఒకటి అర వచ్చినా ఆడియన్స్ కూడా పెళ్ళైన హీరోయిన్ ను ఏం చూస్తాంలే అన్న ఫీలింగ్ ఉంటుంది. కాని ఈ విషయంలో సమంత అంత లక్కీ పర్సన్ మరొకరు ఉండరని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కూడా సమంత తన ఫామ్ కోల్పోలేదు సరికదా మరిన్ని అవకాశాలు అందుకుంటుంది. 

 

ఈ ఇయర్ మజిలీ, ఓ బేబీ తో హిట్ అందుకున్న సామ్ ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ లో నటిస్తుంది. ఆల్రెడీ సుపర్  హిట్ మూవీ కాబట్టి తెలుగులో కూడా పక్కా హిట్ అంటున్నారు. ఇదిలాఉంటే ఇప్పుడు సమంత కొత్తగా వెబ్ సీరీస్ లో కూడా నటిస్తుందని తెలుస్తుంది. అమేజాన్ లో సూపర్ హిట్టైన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ మొదటి సీజన్ పూర్తి అయ్యింది. మనోజ్ బాజ్ పేయ్, ప్రియమణి  కలిసి నటించిన ఆ వెబ్ సీరీస్ ను రాజ్ అండ్ ఢీ డైరెక్ట్ చేశారు.

 

ఇప్పుడు ఆ వెబ్ సీరీస్ సెకండ్ సీజన్  లో సమంత నటిస్తుందని తెలుస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే సమంత ఇందులో నెగటివ్ రోల్ చేస్తుందట. పెళ్లి తర్వాత కూడా సమంత చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ మిగతా హీరోయిన్స్ కు షాక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. 

 

తను చేసే ఎలాంటి పాత్ర అయినా సరే హండ్రెడ్ పెర్సెంట్ న్యాయం చేస్తుంది కనుకే సమంతకు ఇప్పటికి అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు. చూస్తుంటే సమంత ఇదే ఫామ్ ను మరో ఐదు, ఆరేళ్ల దాకా కొనసాగించేలా ఉంది. అక్కినేని ఫ్యామిలీలో ఇప్పుడు సమంత మాత్రమే ఫుల్ ఫామ్ లో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: