దేశ స్వాతంత్రం కోసం పోరాడిన తెలుగు ప్రాంతానికి చెందిన మొట్టమొదటి పోరాట యోధుడిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సంపాదించాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా దేశం కోసం పోరాటం చేసి ప్రజల మన్ననలను పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సైరా నరసింహారెడ్డి గా తెరకెక్కించి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మాణం జరిగింది. దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు మరియు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది.


దసరా సెలవులు అయిపోయిన గాని సక్సెస్ ఫుల్ గా సైరా సినిమా హాల్స్ హౌస్ ఫుల్ బోర్డు లతో దర్శనమిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలుగువాడిగా దేశం కోసం పోరాడిన ఉయ్యాలవాడ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా  మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా బడా రాజకీయ నేతలను కలిసి సినిమా చూడాలని పేర్కొన్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ను కలిసి సినిమా గురించి ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సైరా సినిమా యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.


దేశ భక్తిని పెంపొందించే సినిమాలు చాల తగ్గిపోయాయని సై రా నరసింహారెడ్డి ఆ కొరతని తీర్చేసింది అని చిరంజీవిని కొనియాడారు. వెంకయ్య నాయుడు తన నివాసం లో చిరంజీవి, కుటుంబ సభ్యులు, కామినేని శ్రీనివాస్ తో సై రా ని చూసినట్లు తెలుస్తుంది. సినిమాలో బ్రిటిష్ పాలకులు భారతీయుల పై చేసిన దౌర్జన్యాలను, పాలనా విధానాన్ని, స్వార్థాన్ని, అంతర్గత కలహాల్ని చక్కగా చూపించారని అన్నారు. నిర్మించినందుకు రామ్ చరణ్ ని, దర్శకత్వం వహించినందుకు సురేందర్ రెడ్డి ని ప్రశంసలతో ముంచెత్తారు వెంకయ్య నాయుడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: