మామూలుగానే కాస్త అత్యుత్సాహం ప్రదర్శించే తెలుగు చానెల్స్ లిస్టులో జెమినీ టీవీ ముందుంటుంది. శాటిలైట్ హక్కుల విషయంలో టీవీ ఛానెల్స్ చాలా గుంభనంగా వ్యవహరిస్తాయి. ఇక పెద్ద సినిమా శాటిలైట్ హక్కుల్ని ఏదైనా ఛానెల్ దక్కించుకుంటే, ఆ సమాచారం బయటకు అసలు పొక్కదు. అది లీకుల రూపంలో తప్ప..... సదరు చానెల్ ఆర్భాటంగా ప్రకటించుకోదు. కానీ జెమినీ టీవీ ఛానెల్ వ్యవహారం మాత్రం దీనికి కాస్త భిన్నంగానే ప్రవర్తిస్తుంది అని చెప్పవచ్చు.

ఎలాంటి సినిమా అయినా దాన్ని ఘనంగా ప్రకటించుకుంటోంది ఈ ప్రముఖ ఛానెల్.ఇక్కడి వరకు అయితే పర్వాలేదు కానీ.... మరీ అత్యుత్సాహానికి పోయి కొన్ని విషయాల్ని, ముందుగానే ప్రకటించి ఫ్యాన్స్ తో చీవాట్లు తింటోంది జెమినీ టీవీ ఛానెల్. ఉదాహరణకు, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఇప్పటికే జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఆ విషయం చెప్పుకుంటే తప్పులేదు. కానీ అంతటితో ఆగకుండా బాలయ్య సినిమాకు ఏకంగా "రూలర్" అనే టైటిల్ కూడా పెట్టినట్టు ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యింది సదరు ఛానల్.

ఈ సినిమాకు మూవీ యూనిట్ అనుకున్న టైటిల్స్ లో రూలర్ అనే టైటిల్ ముందు వరుసలో ఉండటంతో  రేపో మాపో ఈ టైటిల్ ను గ్రాండ్ గా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇంతలోనే  జెమినీ టీవీ  ఆ పేరును బయటపెట్టడంతో, అభిమానులు  అంతా చాలా ఫైర్ అయ్యారు ఛానల్ పై. దీంతో ఆ ట్వీట్ ను తొలిగించింది సదరు ఛానెల్. ఇదొక్క సంఘటనే కాదు, ఇటీవల నాగచైతన్య నటిస్తున్న సినిమా విషయంలో కూడా ఇలానే వ్యవహరించింది జెమినీ ఛానెల్. దిల్ రాజు  నిర్మాణంలో,నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇది అందరికీ తెలిసైనా విషయం అయినా,ఇందులో  నాగచైతన్య సరసన రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారనే విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.ఈ విషయాన్ని గ్రాండ్ గా ప్రకటిద్దామని యూనిట్ భావిస్తుంటే,ఈలోపల జెమినీ టీవీ పూనుకొని,పుసుక్కున  ప్రకటన చేసి ఉన్న ఆ కాస్త హైప్ను పోగొట్టేసింది.  ఇలాంటి అత్యుత్సాహం పనులు చాలానే చేసింది ఈ ఛానెల్. సంక్రాంతి టైమ్ అప్పుడు కూడా,వినయ విధేయ రామ,మహేష్ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నప్పుడు ఛానల్ ఇలానే అతుత్సహం ప్రవర్తించి అభిమానుల ఆగ్రహానికి గురైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: