నందమూరి కళ్యాణ్ రాం హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. ఆదిత్య మ్యూజిక్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్టుగా సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు పోటీ పడుతున్నారు.


మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రెండు ఒకేరోజు రిలీజ్ డేట్ ప్రకటించడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ సినిమాలకు పోటీగా సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వస్తున్న దర్బార్ సినిమా కూడా జనవరి 10న రిలీజ్ అవుతుంది. జనవరి 12న మహేష్, బన్ని ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతుండగా.. కళ్యాణ్ రాం సినిమా మాత్రం జనవరి 15న రిలీజ్ ఫిక్స్ చేశారట.


స్టార్ సినిమాలకు పోటీగా రావలంటే రిస్క్ అన్నట్టే. సతీష్ వేగేశ్న శతమానం భవతి సినిమా సంక్రాంతికి వచ్చే హిట్ అయ్యింది. అయితే అదే సెంటిమెంట్ తో కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ చేస్తున్నారు. శతమానం భవతి సినిమా హిట్ మేనియా ఈ మూవీ రిపీట్ చేస్తే పర్వాలేదు. కాని తేడా కొడితే మాత్రం చాలా పెద్ద దెబ్బే వేస్తుంది.


కళ్యాణ్ రాం ఇదవరకు ఎప్పుడు కనిపించని విధంగా చాలా సెటిల్డ్ గా ఈ మూవీలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. మహేష్, అల్లు అర్జున్, కళ్యాణ్ రాం, రజినికాంత్ సంక్రాంతికి పోటీ పడుతున్న వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. 118తో హిట్ అందుకున్న కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురాతో కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: