సాహో సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారో తెలిసిందే.. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్.. అందులోనూ హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజైంది. కాకపోతే.. ఒక్క హిందీలో తప్ప మిగిలిన భాషల్లో అంత సీన్ లేకుండా పోయింది. అసలే సాహో సినిమా నిరాశపరచిన మూడ్ లో ఉన్న ప్రభాస్ కు ఇప్పుడు మరో చిక్కు చిరారు పెడుతోంది.


తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సాహో నిర్మాతలపై కేసు నమోదైందట. ఇంతకీ ఫిర్యాదు చేసిందెవరో తెలుసా.. ఓ బ్యాగుల కంపెనీ ప్రతినిధులు. అసలు బ్యాగుల కంపెనీకి సాహో సినిమాకూ లింకేమిటనుకుంటున్నారా అక్కడే ఉంది తమాషా. ఆర్కిటిక్ ఫాక్స్ అని పేరున్న


బ్యాగు కంపెనీ వారు తమ సినిమా ప్రమోషన్ కోసం సాహో సినిమాను వాడుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సాహో టీమ్ ను కలిశారట. ఈ సినిమాలో కొన్ని సీన్లలో మా బ్యాగును చూపిస్తే మీకు కొంత ముట్టజెబుతాం అని ప్రపోజల్ పెట్టారట.


ఇదేదో బావుంది కదా అనుకున్నారో ఏమో మొత్తానికి కోటిన్న రూపాయలతో ఈ బ్యాగుల కంపెనీతో సాహో నిర్మాతలకు ఒప్పందం కుదిరిందట. అంతా బాగానే ఉంది. బ్యాగుల కంపెనీ డబ్బు ముట్టజెప్పేసింది. కానీ సినిమాలో మాత్రం ఈ కంపెనీ బ్యాగు ఎక్కడా కనిపించ లేదు. మరి డబ్బు తీసుకున్న విషయం మరిచిపోయారో.. లేక.. ఉపయోగించడానికి తగిన సీన్ దొరకలేదో ఏమిటోతెలియదు.


దీంతో సదరు బ్యాగ్ కంపెనీ ప్రతినిధలు.. సాహో నిర్మాతలు తమను మోసం చేశారంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసులో విచారణ ఎలా జరుగుతుందో చూడాలి. అయితే సాహో నిర్మాతలు మరీ అంత చీప్ గా కక్కుర్తిపడ్డారా అన్న టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: