త్రిష..ఏ.ఎం. రత్నం నిర్మించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తరుణ్, శ్రియ శరణ్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరోగా నటించిన తరుణ్ ని అందరు ఎప్పుడో మర్చిపోయారు. కానీ హీరోయిన్స్ ఇద్దరు మాత్రం టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. అడపదడపా శ్రియ సినిమాలు చేస్తున్నప్పటికి త్రిష కి మాత్రం తెలుగులో సినిమాలు లేవు. దీంతో త్రిష కెరీర్ ఇక ముగిసిందనుకున్నారు అందరు. అయితే తను ఎంచుకునే సినిమాల ట్రెండ్ మార్చి మళ్లీ స్పీడ్ అందుకుంది. 96 సినిమాతో త్రిషకు ముందున్న స్టార్ డమ్ వచ్చేసిందనే చెప్పాలి. ఈ విజయంతో ఆమెకు పెద్ద సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. లేడీ ఒరియెంటెడ్ సబ్జెక్ట్స్ రాసుకున్న యువ దర్శకులు, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శక, నిర్మాతలు త్రిష వైపే చూస్తున్నారు. అయితే ఏమాత్రం తొందరపడకుండా వాటికి కూడా సెలెక్టివ్ గానే సైన్ చేస్తోంది త్రిష.

ప్రస్తుతం త్రిష చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మణిరత్నం చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఒక కీలక రోల్ చేస్తున్న త్రిష మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మొహాన్ లాల్ హీరోగా చేయనున్న సినిమాలోను నటించనుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులో కూడా త్రిష కథానాయికగా ఎంచుకున్నారనే అనే వార్తలు వినబడుతున్నాయి. దాదాపు ఈ సినిమాలో త్రిష ఫైనల్ అన్నట్టుగాను అంటున్నారు. ఎందుకంటే ఇంతకముందే స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ తో కలిసి త్రిష నటించింది. దాంతో ఈ కాంబినేషన్ మీద అందరికి ఆసక్తి బాగానే ఉంది.

ఇవి కాకుండా ఇంకా ఆమె సైన్ చేయాల్సిన, వినాల్సిన ప్రాజెక్ట్స్ 4-5 ఉన్నాయట. ఇంకో రెండు హిట్లు గనుక పడితే ఇపుడప్పుడే ఆమె వెనక్కి తిరిగి చూసుకునే పరిస్తితి ఉండదు. మొత్తానికి త్రిష మరిసారి సౌత్ టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు మళ్ళి నయనతారకు గట్టి పోటీ కూడా అవుతుందన్న వార్తలు కోలీవుడ్ లో బాగానే వినిపిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: