‘సైరా’ విడుదలై రెండు వరాలు దాటిపోయినా చిరంజీవి ఇంకా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ ప్రమోషన్ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకొని అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులను కలుస్తూ చిరంజీవి ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ బిజెపి అధ్యక్షుడు అమీత్ షాలను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి ఇలా ఢిల్లీలో ప్రముఖ రాజకీయ నాయకులను కలుస్తూ ‘సైరా’ ను ప్రమోట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది అని అంటున్నారు. చిరంజీవి రాజకీయాలకు దూరం అయినా రాజ్యసభ సభ్యుడుగా కొనసాగాలన్న కోరిక మనసులో ఇంకా బలంగా ఉందని ఈ కారణాలు వల్ల కేంద్రప్రభుత్వం చేత రాజ్యసభకు నామినేట్ ఆవడం కోసం ఇలా చిరంజీవి తన వ్యూహాలు రచిస్తూ ఢిల్లీలోని అధికార పార్టీ నేతలను ‘సైరా’ వంకతో కలుస్తున్నాడు అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. 

అయితే చిరంజీవి అనుసరిస్తున్న ఈ వ్యూహాలు అతడికి రాజకీయంగా ఎలాంటి సహాయపడతాయో తెలియకపోయినా ‘సైరా’ ప్రమోషన్ విషయంలో మెగా స్టార్ వ్యూహాలు మెగా అభిమానులకు మాత్రం కొంత బాధగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ‘సైరా’ సూపర్ హిట్ అయినా చిరంజీవి తన అభిమానుల ముందుకు వచ్చి థాంక్స్ గివింగ్ మీట్ ను పెట్టలేదు. 

అంతేకాదు ‘సైరా’ ప్రదర్శింప బడుతున్న ధియేటర్ల వద్దకు వచ్చి చిరంజీవి తన అభిమానులకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియ చేస్తే మెగా అభిమానులకు మరింత జోష్ కలిగేదనీ మెగా వీరాభిమానుల అభిప్రాయం. సినిమా కలక్షన్స్ పడిపోకుండా ఉండాలి అంటే ధియేటర్లకు వచ్చి ప్రేక్షకుల మధ్య సందడి చేస్తే పెరుగుతాయి కాని దేశ రాజధానిలో కూర్చుని ప్రముఖ రాజకీయ నాయకులను కలుస్తూ ‘సైరా’ ను ప్రమోట్ చేస్తే ఈ మూవీ కలక్షన్స్ ఏమి పెరుగుతాయి అంటూ మెగా అభిమానులలోని ఒక వర్గం లోలోపన మధన పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: