మహేష్ కు ఉన్న క్రేజ్ రీత్యా అతడి పారితోషికం ఇప్పుడు 20 కోట్ల స్థాయిని మించి ఉన్నది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ బిజినెస్ ద్వారా మహేష్ కు 35 కోట్ల షేర్ లాభాలలో రాబోతోంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో మహేష్ కు సమంత బుల్లితెర పై ఊహించని షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది.

ఈ మధ్య మహేష్ నటించిన ‘మహర్షి’ సమంత ‘ఓ బేబి’ మూవీలు ఒకేరోజు వివిధ ఛానల్స్ లో ప్రసారం కాబడ్డాయి. జెమిని టివిలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన మహర్షి సినిమాకు కేవలం 8.42 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఈ రెంటింగ్ టాప్ హీరోల సినిమాలకు చాల తక్కువ. 

 గతం లో ‘రంగస్థలం’ మూవీకి మొదటి సారి 19.5 రేటింగ్ వస్తే ‘జనతా గ్యారేజ్’ మూవీకి 20.69 రేటింగ్ వచ్చింది. ఫెయిల్ అయిన అల్లు అర్జున్ ‘డీజే’ కు 20.7 రేటింగ్ తెచ్చు కోవడమే కాకుండా ‘ఫిదా’ ‘గీత గోవిందం’ లాంటి మూవీలు కూడ 20 పైనే రేటింగ్స్ తెచ్చుకున్నాయి.  దీనితో వీటి రేటింగ్స్ తో పోలిస్తే ‘మహర్షికి’ వచ్చిన రేటింగ్ చాల తక్కువ. అంతేకాదు అదేరోజు మా టివిలో ప్రసారం అయిన ‘ఓ బేబి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు 6.12 రేటింగ్ వచ్చింది. 

అయితే మహేష్ ‘మహర్షి’ మూవీని జెమిని టివి 20 కోట్లకు కొనుక్కుంటే మా టివి ‘ఓ బేబి’ మూవీని కేవలం 5 కోట్ల లోపు కొనుక్కున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో మహేష్ ‘మహర్షి’ స్థాయి సమంత ‘ఓ బేబి’ సమానమా అంటూ కొంతమంది జోక్స్ వేస్తున్నారు. ఇలా ‘మహర్షి’ కి తక్కువ రేటింగ్ రావడానికి మరొక కారణం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో జనం విపరీతంగా చూసేయడంతో బుల్లితెర పై ‘మహర్షి’ సినిమా మళ్ళీ చూసేకంటే ‘ఓ బేబి’ ని చూడటానికి ఆసక్తి కనపరిచారు అనుకోవాలి. ఈ రేటింగ్స్ ఫలితంతో మహేష్ భవిష్యత్ సినిమాలకు సంబంధించి బుల్లితెర సాటిలైట్ రైట్స్ మార్కెట్ తగ్గినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: