టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు సూపర్ హిట్ తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ లు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. దాంతో ఆలోచనలో పడ్డారు మహేష్ బాబు.  మరోసారి కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో ఉన్న మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో రైతు సమస్యలపై పోరాడే ఓ ఎన్ఆర్ఐ గా మహేష్ నటించిన ‘మహర్షి’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ రెండువందల కోట్ల క్లబ్ లో చేరింది. 

సాధారణంగా వెండి తెరపై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బుల్లితెరపై మంచి సక్సెస్ రేటింగ్ సాధిస్తుంటాయి. కొన్ని సార్లు వెండితెరపై బ్లాక్ బస్టర్ అయిన మూవీస్  బుల్లితెరపై దారుణమైన రేటింగ్ తెచ్చుకుంటాయి.  ఇప్పుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీ  పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు. ఆ మద్య 'రంగస్థలం' సినిమాకి 19.5, 'జనతా గ్యారేజ్' సినిమాకి 20.69, డీజే సినిమాకి 21.7 రేటింగ్స్ వచ్చాయి. 

స్టార్ హీరోల సినిమాలు కనుక రేటింగ్ ఆ స్థాయిలో ఉండటం సహజం. కానీ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాకు దారుణమైన రేటింగ్ రావడం అందరికీ షాక్ ఇచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన 'మహర్షి' సినిమాకి కేవలం 8.42 టీఆర్పీ  మాత్రమే వచ్చింది.  భారీ పోటీ మధ్య 'మహర్షి' శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జెమినీ టీవీ. సినిమాకి ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంది. పండుగ సమయం చూసి ప్రసారం కూడా చేశారు. కానీ 'మహర్షి'ని బుల్లితెరపై వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: