ఈ మద్య రియాల్టీ షోల్లో కాస్త శృతిమించిన వ్యవహారాలు జరుగుతున్నాయని ఎన్నో వార్తల్లో చూశాం. సాధారణంగా సెలబ్రిటీస్ కి ఫాన్స్ ఉండటం అనేది సహజమైన విషయమే. కానీ ఆ ఫాన్స్ చూపించే అభిమానం కొన్నిసార్లు కట్టలు దాటడం అనేది చేసేవారికే కాదు సెలెబ్స్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది. గతంలో ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల సినీ తారలు ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు కోకొల్లలు. 

తాజాగా  తెలుగులో నాగార్జున నటించిన ‘కేడీ’లో ‘నీవేనా నీవేనా’ పాటతో పాటు ‘అలా ఎలా’లో ‘థనక్ థనక్’ పాట పాడిన బాలీవుడ్ సింగర్‌ నేహా కక్కడ్ కు అభిమాని నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘పాపులర్ సింగింగ్’ రియాలిటీ షో ఇండియన్ ఐడల్‌కు దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఈ షోలో జడ్జిగా ప్రముఖ సింగర్ నేహా కక్కడ్ వ్యవహరిస్తున్నారు.  ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక కంటెస్టెంట్ నేహా కక్కడ్‌కు కిస్‌ చేస్తూ కనిపిస్తున్నాడు.

ఒక కంటెస్టెంట్ కొన్ని గిఫ్టులను తీసుకుని స్టేజీ మీదకు వచ్చాడు. సరే ఫ్యాన్ కదా తనకు గిఫ్టులు తీసుకు వచ్చాడన్న సంబరంలో ఉండగానే పెద్ద షాక్ ఇచ్చాడు.  నేహా కక్కడ్ ని దగ్గరకు తీసుకొని బుగ్గపై ముద్దు పెట్టాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారే షాక్ కి గురయ్యారు..ఇక నేహా కక్కడ్ సిగ్గుపడుతూ ముఖం దాచుకొని వెళ్లి తన సీట్లో కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: